Breaking News

కార్మికుడి మృతిపై అనుమానాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

Published on Fri, 03/14/2025 - 18:04

విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓ కార్మికుడు  మృతి చెందిన ఘటనపై అతని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోక్ అవెన్ డిపార్ట్ మెంట్ లో  సూర్య వెంకట రమణ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతదేహాన్ని ప్రధాన గేటు వద్దే అంబులెన్స్ సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు.  ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. మృతదేహంతో బంధువులు స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు.

సూర్య వెంకట రమణ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  మరొకవైపు మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  కనీసం ఫోన్, పర్స్ లాంటి ఏవీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాచారం వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని, ఫోన్ స్విచ్చాప్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. గుండె పోటుతో మరణించినట్లు చెబుతున్నారన్నారు.

అయితే కార్మికుడు సూర్య వెంకట రమణ.. అరటి చెట్టు కింద కూర్చొని చనిపోయాడని కొందరు చెబుతుంటే, గోడకు జారబడి చనిపోయాడని మరికొందరు చెబుతున్నారన్నారు. ట్రాక్టర్ మీద పడిపోయి ఉన్నారని వేరే వాళ్లు చెప్పారన్నారు. నోటి నుంచి బ్లడ్ వచ్చి చనిపోయినట్లు తమకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  డబ్బున్న వాళ్లకే ప్లాంట్ లో న్యాయం జరుగుద్దనీ, తమ లాంటి పేదలకు న్యాయం జరగదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)