Breaking News

తాడిపత్రిలో పోలీసు రాజ్యం

Published on Mon, 06/30/2025 - 03:44

సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంతింటికి చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే వందలాది మంది వై­ఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవడానికి బయలుదేరారు. దీంతో పోలీసులు పె­ద్ద­­ఎత్తున బలగాలను మోహరించారు. కేతిరెడ్డి ఇం­టిచుట్టూ వలయాకారంలో బారికేడ్లు పెట్టి వైఎస్సా­ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కేతిరెడ్డి ఇంటి పరిసరాల్లోకి సైతం ఎవరూ వెళ్లకుండా నిలువరించారు. 

బలవంతంగా తరలింపు 
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్‌కుమార్, సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ ధరణి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆయనను బయటకు రావాలని కోరారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్తానని ఎన్నిసార్లు ఎస్పీకి విన్నవించుకున్నా ఏదో ఒక సాకు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇష్టానుసారం వ్యవ­హరిస్తున్నారు. 

ఎవడు పడితే వాడితో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వం అంటూ కారుకూతలు కూయిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? చేతనైతే పోలీసులు లేకుండా వాడు (జేసీ ప్రభాకర్‌రెడ్డి), అతడి కార్యకర్తలు నన్ను ఆపమనండి’ అంటూ సవాల్‌ విసిరారు. ఏఎస్పీతో మాట్లాడాలని సీఐ సాయిప్రసాద్‌ సూచించడంతో ఆయనతో మాట్లాడేందుకు పెద్దారెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆయనను కార్యకర్తల తోపులాట మధ్య బలవంతంగా పోలీస్‌ జీపులో అనంతపురం తరలించారు.   

జేసీ ప్రభాకర్‌ ఓవరాక్షన్‌ 
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారన్న సమాచారంతో మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్‌ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో ఇంటికి పిలిపించుకున్నారు. ట్రాక్టర్లలో రాళ్లను తీసుకొచ్చి.. రాళ్ల దాడి చేసేందుకు కేతిరెడ్డి ఇంటివైపు బయలుదేరారు. వారిని సీఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది జేసీ ఇంటివద్దే నిలువరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారన్న సమాచారంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.   

కోర్టు ఉత్తర్వులిచ్చినా.. 
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. రాళ్ల దాడులకు దిగారు. పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. స్వయానా హైకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు రక్షణ కల్పించా­లని ఆదేశించింది. అయినా అనంతపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం పేరుతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వడంలేదు.

ఏదో సాకుతో వాయిదా వేస్తూనే ఉన్నారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి విసిగిపోయారు. పదే పదే ఎస్పీకి లేఖలు రాసినా స్పందించలేదు. పోలీసులు తనకు రక్షణ కల్పించే విషయంలో సహకరించబోరన్న విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పోలీసులు వెంటనే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. మాజీ ఎమ్మెల్యేకు జిల్లా పోలీసులు రక్షణ కల్పించలేక ఆయన్ను బలవంతంగా అనంతపురం తీసుకురావడం విమర్శలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేక జిల్లా ఎస్పీ సైతం తీవ్ర విమర్శల పాలవుతున్నారు.  

‘రప్పా.. రప్పాలాడిస్తాం’ 
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి 
‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. 

కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలో­ని వైఎస్సార్‌సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశా­రు.  ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’అని జేసీ అన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)