Breaking News

అప్పులు తీర్చలేక... బతకలేక!

Published on Mon, 04/07/2025 - 05:50

పాములపాడు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రైతులు, కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అప్పుల బాధతో ఓ కౌలు రైతు తన కన్నతల్లి, కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి, ఆ తర్వాత అతను కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నింనంచాడు. 

నంద్యాల జిల్లాలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన సోమేశ్వరుడు 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పలు పంటలు సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, చేతికొచ్చిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రూ.10 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చలేనని తీవ్ర మనస్తాపానికి గురైన సోమేశ్వరుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

గురువారం మధ్యాహ్నం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తన తల్లి శివమ్మ, భార్య లావణ్య, కూతురు నిఖిత(9), కుమారుడు భరత్‌(7)కు ఇచ్చాడు. వారు తాగిన తర్వాత తాను కూడా ఆ కూల్‌ డ్రింక్‌ తాగాడు. అదే రోజు రాత్రి ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, పాములపాడు ఆస్పత్రికి వెళ్లారు. ‘రాత్రి మిగిలిన అన్నం తినడంతో అస్వస్థతకు గురయ్యాం’ అని సోమేశ్వరుడు చెప్పాడు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘కలుషిత ఆహారంతో ఐదుగురికి అస్వస్థత’ అని పత్రికల్లో వార్తలు రావడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్‌ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌ కర్నూలు ఆస్పత్రికి వెళ్లి సోమేశ్వరుడిని పరామర్శించారు. 

ఐదుగురి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కలుషిత ఆహారం వల్ల వారు అస్వస్థతకు గురి కాలేదని నిర్ధారించి, గట్టిగా నిలదీయడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సోమేశ్వరుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఐదుగురి కిడ్నీల పనితీరు బాగాలేదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఎంపీడీవో తెలిపారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)