Breaking News

గజగజ వణికిస్తున్న చలి

Published on Sat, 12/27/2025 - 03:53

సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. గతానికి భిన్నంగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా రాష్ట్రంలో శీతాకాలం ఓ మోస్తరుగా ఉండేది. కానీ ఈ  సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 4 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగూడలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, పెదబయలు, పాడేరు, చింతపల్లి, వై.రామవరం, హుకుంపేట మండలాల్లో గత 20 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్నిచోట్ల 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

గురువారం నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. 2021 నుంచి 2024 వరకు ఎల్‌నినో ప్రభావం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చలికాలంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ఏడాది పరిస్థితి మారింది. 

లానినా ప్రభావంతోనే.. 
ఈ మార్పులకు ప్రధానంగా లానినా ప్రభావమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన ఈ పరిస్థితుల వల్ల ఉత్తర భారతం నుంచి వీచే అతి శీతల గాలులు నేరుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనికితోడు హిమాలయాల్లో ఈ ఏడాది భారీగా కురుస్తున్న మంచు వల్ల అక్కడ ఏర్పడిన శీతల తరంగాలు ఒడిశా మీదుగా మన రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. 

ఈసారి పొడి వాతావరణం ఉండడం వల్ల భూమి త్వరగా చల్లబడి రాత్రివేళల్లో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. వాతావరణ అధ్యయనాల ప్రకారం భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) పెరగడం వల్ల కేవలం ఎండలే కాకుండా శీతాకాలంలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. 

వాతావరణంలోని జెట్‌ స్ట్రీమ్స్‌ బలహీనపడడం వల్ల ధృవ ప్రాంతాల్లో ఉండాల్సిన చల్లని గాలులు దక్షిణాది వైపు మళ్లుతున్నాయి. అందుకే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చలి పెరిగింది. భవిష్యత్తులోనూ ఇలాంటి చలి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)