Breaking News

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

Published on Fri, 04/21/2023 - 08:24

అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్‌ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్‌ పిన్స్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. కొలంబస్‌ ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్‌ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్‌కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్‌ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు.  

కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్‌ అమెరికాలోని ఓహియో స్టేట్‌ పిన్స్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్‌ వచ్చిన సాయిష్‌.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్‌ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్‌ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: రంజాన్‌ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)