Breaking News

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

Published on Thu, 11/30/2023 - 06:50

సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్‌ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు.

సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు?: కోమటిరెడ్డి
సాగర్‌ డ్యామ్‌పై పోలీసుల హడావుడి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. సాగర్‌ డ్యామ్‌పై పోలీసుల డ్రామా కేసీఆర్‌ పనేనన్నారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్‌ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)