Breaking News

శ్రీశైలంలో నీటిని వాడుకోకుండా ఏపీని అడ్డుకోండి

Published on Thu, 02/27/2025 - 05:55

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. నాగార్జున­సాగర్‌ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ఏపీ తీసుకుంటున్న 7000 వేల క్యూసెక్కులను తక్షణమే 5000 క్యూసెక్కులకు తగ్గించేలా ఆదేశాలు జారీ చేయా­లని కోరింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లో మిగిలి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంపై బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైద­రా­బాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ రెండో అత్యసవర సమావేశం జరగాల్సి ఉండగా, ఏపీ విజ్ఞప్తితో గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. 

దీంతో తెలంగాణ నీటిపారు­దల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఇతర అధికారు­లు బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌తో సమావేశమై తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికే ఏపీ వాటాకి మించి జలాలను వాడుకుందని, ఇంకా అనధికారికంగా నీళ్లను తోడుకోవడానికే సమా­వేశా­నికి గైర్హాజరైందని రాహుల్‌ బొజ్జా అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు పట్ల ఏపీకి కనీస గౌరవం లేదని, ఆ రాష్ట్ర అధికారులు తరుచూ బోర్డు సమావేశాలకు గైర్హాజరవుతున్నా­రని మండిపడ్డారు. 

ఒంగోలు సీఈ హైదరాబాద్‌లోని జలసౌధలోనే ఉన్నా ఈ సమావేశానికి రాలేదని అన్నారు. గురువారం నిర్వహించే సమావేశంలో రెండు రాష్ట్రాలు పర­స్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి వస్తాయని బోర్డు చైర్మన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ సయోధ్య కుదరకపోతే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకి నివేదిస్తామని చెప్పారు.

తెలంగాణకి 63.. ఏపీకి 55 టీఎంసీలు!
ఈ నెల 24న జరిగిన కృష్ణా బోర్డు తొలి అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ తరపున నల్లగొండ చీఫ్‌ ఇంజనీర్‌ వి.అజయ్‌­కుమార్, ఏపీ తరపున ఒంగోలు చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం జలసౌధలో సమావే­శ­మై ప్రస్తుత రబీలో సాగర్‌ నుంచి ఇరు రాష్ట్రాలకు అవసరమైన సాగునీటి ప్రణాళికను సిద్ధం చేశారు. కనీస నిల్వ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 36.51 టీఎంసీలు, సాగర్‌లో 30.57 టీఎంసీలు కలిపి మొత్తం 67 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్టు నిర్థారించారు. 

శ్రీశైలం నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకి 13 టీఎంసీలు, సాగర్‌ నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకి 50 టీఎంసీలు అవసర­మని నిర్థారించారు. మొత్తం కలిపి ఏపీ 55 టీఎంసీ­లు, తెలంగాణ 63 టీఎంసీలు అవసరమని కోరా­యి. ఈ ప్రణాళిక ఆధారంగా గురువారం జరిగే రెండో అత్యవసర సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)