Breaking News

బొబ్బిలి సబ్‌ జైలుకు జర్నలిస్ట్‌ కేవీఆర్‌

Published on Thu, 07/02/2026 - 17:07

సాక్షి, విజయనగరం: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏపీలో సాగుతున్న అరాచకాలపై గళమెత్తిన జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. మంత్రి లోకేష్ ‘రెడ్ బుక్’ పేరుతో ఏపీలో సాగిస్తున్న రాజకీయ విధ్వంసాన్ని ప్రశ్నించినందుకు.. తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కేవీఆర్ (KVR)ను ఏపీ పోలీసులు అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేశారు.

తన యూట్యూబ్ ఛానల్‌లో ఏపీలోని పరిస్థితులను ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ కేవీఆర్ చేసిన వ్యాఖ్యలను.. కావాలనే భారత రాజ్యాంగానికి ఆపాదిస్తూ కూటమి కార్యకర్తలు ఏపీలో పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీస్ బృందం తీవ్ర ఒత్తిడిల నడుమ హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఉన్న కేవీఆర్ నివాసంలో ఆయన్ను అరెస్ట్ చేసింది. కనీసం 41-ఏ నోటీసు కూడా ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ అరెస్ట్ సాగింది.

మరోవైపు పోలీసుల నోటీసులకు స్పందించలేదన్న కారణాన్ని చూపిస్తూ.. బొబ్బిలి న్యాయస్థానం కేవీఆర్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలను కాలరాస్తూ.. మఫ్టీలో వచ్చి జర్నలిస్ట్ కేవీఆర్‌ను అరెస్ట్ చేసే క్రమంలో ఆయన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన బొబ్బిలి రూరల్ సీఐ కె. శ్రీనివాస్‌పై తెలంగాణలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కేవీఆర్ భార్య విజయలక్ష్మి పోలీసులకు సాక్ష్యాలుగా అందజేశారు. గత రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో ఏపీ పాలకులు మరికొన్ని అరెస్టులకు కూడా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)