Breaking News

శ్రీశైలం జలాశయం ఖాళీ!

Published on Sat, 12/28/2024 - 05:36

సాక్షి, అమరావతి: దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ కేంద్రాల ద్వారా తరలించాలన్న నిబంధనను తెలంగాణ జెన్‌కో తుంగలోకి తొక్కేసింది. కృష్ణా బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. 

శుక్రవారం సాయంత్రం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తరలించేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదు. 

తెలంగాణ జెన్‌కో ఇదే రీతిలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ పోతే జనవరి 15వ తేదీలోగా శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల రాయలసీమతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

చంద్రబాబు సర్కార్‌ నిర్వాకం వల్లే...  
రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని సాకు చూ­పుతూ దాన్ని తెలంగాణ సర్కార్‌ తన ఆ«దీనంలోకి తీసుకుంది. 

ఇదే సమయంలో నాగార్జునసాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ దాన్ని కూడా తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై అప్పటి చంద్రబాబు సర్కార్‌ చూసీ­చూడనట్లు వ్యవహరించింది. తెలంగాణ, ఏపీలో టీడీపీ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పట్లో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. 

ఆ పాపం పర్యవసానంగానే కృష్ణా బోర్డు అను­మతి లేకుండా అక్రమంగా శ్రీశైలం ప్రా­జెక్టులో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ మన రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ వస్తోందని రైతులు మండిపడుతున్నారు.  

‘ఏపీ వాదన సహేతుకం కాదు’ 
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై  ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్‌–89 మార్గదర్శకాల ప్రకారమే  వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వ వాదన సహేతుకం కాదని తెలంగాణ ప్రభు­త్వం చెప్పింది.  సెక్షన్‌–89లోని మార్గదర్శకాలు, 2023 అక్టోబర్‌ 6న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం –1956లో సెక్షన్‌ 3 ప్రకారం జారీ చేసిన అదనపు  నిబంధనలు  రెండూ ఒకటేనని.. రెంటినీ కలిపి వాదనలు వి­నా­­­లంది. 

కాలయాపన, తాత్కాలిక ఏ­ర్పా­టును అడ్డంపెట్టుకుని నీటిని తరలించడం కోసమే ఏపీ ఆ రెండు భిన్నమైనవని వాదిస్తోందని పేర్కొంది. సెక్షన్‌–89, సెక్షన్‌–3 కింద ఇచ్చిన మార్గదర్శకాలు వేర్వేరని భావిస్తే.. తొలుత సెక్షన్‌–3 కింద వాదనలు వినాలని తేల్చి చెబుతూ జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యు­నల్‌ (కేడబ్ల్యూడీటీ)–2లో తెలంగాణ ప్ర­­భు­త్వం శుక్రవారం అఫిడవిట్‌ దాఖ­లు చేసింది. 

కేంద్రం 2023 అక్టోబర్‌ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని తె­లంగాణ తెలిపింది. అందువల్ల సు­ప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై వి­చారించడానికి వీల్లేదన్న ఏపీ వాదన అసంబద్ధమని కొట్టిపారేసింది.  

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)