Breaking News

తహసీల్దార్‌ కళ్లలో కారం.. 3 గంటలు నిర్బంధం

Published on Wed, 12/24/2025 - 05:43

బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో సర్వే నంబర్‌ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివా­దం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని, చాలాకాలంగా సాగు చేస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ, యాండ్రప్రగడ సత్యనారాయణ, అతడి కుటుంబం, ఒట్టికూటి ఝాన్సీరాణి, యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఆర్డీవో ప్రొటెక్షన్‌ ఆర్డర్‌ అమలు చేసేందుకు తహసీల్దార్‌ పీవీ చలపతిరావు వీఆర్వోలు, సర్వేయర్లు, పోలీ­సు­లతో కలిసి బైక్‌లపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్‌తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్, మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో వచ్చారు. అధికారుల మోటార్‌సైకిళ్లలో గాలి తీసేశారు. ఓ వీఆర్‌వో బైక్‌ అద్దాలను పగులగొట్టారు. 

పంటను పాడుచేసినందుకు సమాధానం చెప్పాలంటూ... తహసీల్దార్‌ కంట్లో కారం చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక తహసీల్దార్‌తో పాటు, ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు, ఆరుగురు కానిస్టేబుళ్లు, రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బాలసురేష్‌ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. 

కాగా, బైక్‌లను ధ్వంసం చేయడంతో రెవెన్యూ అధికారులు ఇనుమూరు నుంచి కాలినడకన పందిరిమామిడిగూడెం వచ్చారు. బుట్టాయగూడెంకు చెందిన రైతు తాటినాడ హరిబాబుకు ఫోన్‌ చేయగా ఆయన కారు తీసుకెళ్లి తహసీల్దార్‌ను రాత్రి 7:30కు తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)