Breaking News

దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక బోధన నైపుణ్యం

Published on Wed, 07/26/2023 - 05:05

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫస్ట్‌ ఇన్‌క్లూజివ్‌ డిజిటల్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతో డిజిటల్‌ విద్యను అందిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర సమగ్ర శిక్ష, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఆర్‌డీటీ అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం ఆర్‌డీటీ ఆడిటోరియంలో జరిగిన ‘ఫస్ట్‌ ఇన్‌క్లూజివ్‌ డిజిటల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోని ఆరు జిల్లాల (అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసా­యి, కర్నూలు, నంద్యాల, కడప) నుంచి 300 మంది దివ్యాంగ, సాధారణ విద్యార్థులతో కలిపి విజువల్‌ కోడింగ్,  ఆక్సిస్బల్‌ కోడింగ్, రోబోటిక్, వెబ్‌ డిజైన్, యానిమేషన్‌ గేమ్స్‌ డెవలప్‌మెంట్‌ వంటి 100 డిజిటల్‌ నైపుణ్యాల ప్రాజెక్టులను ప్రదర్శించి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ  ప్రొఫె సర్‌ ఎం.రామకృష్ణారెడ్డి, ఆర్‌డీటీ డైరెక్టర్‌ దశరథ్, చక్షుమతి ఫౌండేషన్‌ ప్రతినిధి రామ్‌కమల్, సైబర్‌ స్క్వేర్‌ సీఈవో ఎన్‌.పి.హరిష్, ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)