Breaking News

కూటమి ప్రభుత్వంలో టీచర్లకు దగా

Published on Fri, 08/08/2025 - 05:51

సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ విమర్శించింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ కేబినెట్‌ సమావేశంలోనూ  ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బకాయిలపై చర్చించలేదని పేర్కొంది.  తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలోనైనా బకాయిలు, డీఏలు, ఆరి్థక ప్రయోజనాలు, 12వ పీఆర్సీ, ఐఆర్‌ పైనా ప్రభుత్వం ప్రస్తావిస్తుందనుకున్నా నిరాశే మిగిలిందని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  పి.అశోక్‌ కుమార్‌ రెడ్డి, గెడ్డం సుధీర్‌ విమర్శించారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని, బకాయిలన్నీ విడుదల చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచి్చన  తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం మానేసిందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు జరిగి మూడు నెలలు కావొస్తున్నా, కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.  ఉపాధ్యాయుల సమస్యలు సత్వరం పరిష్కరించకపోతే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.   

‘విద్యాశక్తి’ని వాయిదా వేయాలి 
కాగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘విద్యాశక్తి’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌ వి.రెడ్డి శేఖర్‌ రెడ్డి మరో ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  పాఠశాల పనివేళలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనడం అధికారుల అనాలోచిత నిర్ణయమని, ఇది ఉపాధ్యాయులపై పనిభారాన్ని పెంచడమేనని  విమర్శించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)