Breaking News

‘అశోక్‌ లేలాండ్‌’పై టీడీపీ దుష్ప్రచారం

Published on Sun, 06/22/2025 - 04:57

సాక్షి, అమరావతి:  అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీది ఒకటే లక్ష్యం. ప్రత్యర్థులపై ఇష్టమొచ్చినట్లు అసత్యాలు వండివార్చడం, అడ్డగోలుగా వారిపై దు్రష్పచారం చేయడం. విజయవాడకు సమీపంలోని మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ యూనిట్‌ విషయంలోనూ ఆ పార్టీ, పచ్చమూకలు ఇదే పైత్యం ప్రదర్శిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన కంపెనీని తమ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందంటూ నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

నిజానికి.. 2018లో నిర్మాణం ప్రారంభించిన ఈ సంస్థ గత ప్రభుత్వ మద్దతుతో వేగంగా పనులు పూర్తిచేసుకుని కోవిడ్‌ ఉన్నా 2021లో ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే విషయాన్ని అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఫిబ్రవరి 19, 2021న స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు కూడా సమాచారం ఇచ్చింది. ఇలా అప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన కంపెనీని ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ తిరిగి ప్రారంభించి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

పలుమార్లు లేఖలు రాసిన జగన్‌ ప్రభుత్వం
వాస్తవానికి.. జీఎస్టీ, మార్కెట్‌ డిమాండ్‌ లేకపోవడం,కోవిడ్‌ సంక్షోభం తదితర కారణాలతో దేశీయ ఆటోమొబైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థ దెబ్బతినడంతో పలు ఆటోమొబైల్‌ యూనిట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. అదే బాటలో అశోక్‌ లేలాండ్‌ కూడా ఉత్పత్తికి బ్రేక్‌ ఇచ్చింది. దీనిపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అశోక్‌ లేలాండ్‌కు పలుమార్లు లేఖలు రాసింది. ఈ లేఖలతో పాటు  ఇప్పుడిప్పుడే తిరిగి వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుండడంతో అశోక్‌ లేలాండ్‌ ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది.

వాస్తవాలిలా ఉంటే.. అశోక్‌ లేలాండ్‌కు ఇస్తామన్న రాయితీలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, అందుకే ఆ సంస్థ ఉత్పత్తి ఆపేసిందంటూ టీడీపీ నాయకులతో పాటు మంత్రి భరత్‌ ఇటీవల చెప్పడంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. యూనిట్‌ను ప్రారంభించేలా గత ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి భిన్నంగా ఇలా విష ప్రచారం చేయడం తగదని, ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నా­రు.

పారిశ్రామికవేత్తలపై వేధింపులుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా నాలుగేళ్లు మొదటి స్థానంలో ఎలా నిలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు ఎటువంటి ఆరోపణలు చేయనప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి అభాండాలు వేయడం తగదని పారిశ్రామిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)