Breaking News

ఎరువులా.. ఇస్తామన్నామా!?

Published on Sat, 05/31/2025 - 04:04

సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాల ద్వారా (ఇది­వరకటి ఆర్బీకేలు) ఎరువుల సరఫరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గతేడాది అరకొరగా కేటాయింపులు జరిపిన మార్క్‌­ఫెడ్, ఈ ఏడాది పూర్తిగా నిలిపి వేసే దిశగా అడుగులు వేస్తోంది. కారణం బఫర్‌ స్టాక్‌ స్కీమ్‌ కింద ఎరువుల నిల్వ కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోక పోవడమే కారణమని చెబుతున్నారు. 

సాగు ఉత్పాదకాలు, సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయిలో రైతుల ముంగిట అందించడమే కాదు.. రైతు సేవలన్నీ అన్నదాతల చెంతకు చేర్చడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎరువుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన బఫర్‌ స్టాక్‌ స్కీమ్‌ కింద ఎరువులను మార్క్‌ఫెడ్‌ గోడౌన్లలో నిల్వ చేసి, సొసైటీల ద్వారా సరఫరా చేసేవారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సొసైటీలతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఎరువులను గ్రామ స్థాయిలో సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అయ్యేది. ఇలా నాలుగేళ్లలో దాదాపు రూ.60 కోట్లకు పైగా ఆదా అయ్యింది. గ్రామ స్థాయిలో నిల్వ చేసేందుకు రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌ హ్యాండ్లింగ్‌ చార్జీల కింద ఏటా రూ.80 కోట్లకు పైగా ఖర్చయ్యేది. ఈ భారాన్ని మొత్తం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భరించేది.

ఏవీ నిధులు? 
» ఏటా 1.50 లక్షల టన్నులు మార్క్‌ఫెడ్‌ ద్వారా బఫర్‌ స్టాక్‌ కింద నిల్వ చేసే వారు. డిమాండ్‌ను బట్టి సొసైటీలు, ఆర్బీకేలకు వీటిని సరఫరా చేసేవారు. గతేడాది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరు­వుల సరఫరాలో నియంత్రణ లేకపోవడంతో రైతులు అదునులో ఎరువులు దొరక్క అవస్థలు పడ్డారు. ఈ ఏడాదైనా ముందస్తు ప్రణాళికతో సిద్ధమయ్యారా అంటే అదీ లేదు. 

» ప్రస్తుతం గ్రామ స్థాయిలో 63 వేల టన్నుల నిల్వలున్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ఒక్క ఆర్‌ఎస్‌కేలో ఒక్క బస్తా కూడా నిల్వ లేని దుస్థితి ఉంది. ప్రస్తుత ఖరీ­ఫ్‌ సీజన్‌ నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా 2 లక్షల టన్నులను బఫర్‌ స్టాక్‌ కింద నిల్వ చే­స్తా­మని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అందుకు తగినట్టుగా నిధులు కేటాయించలే­దు.  

» కనీసం రూ.100 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే బడ్జెట్‌­లో రూ.40 కోట్లే కేటా­యించారు. మిగిలిన రూ.60 కోట్ల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా, ప్రభు­త్వం నుంచి స్పందన లేదు. కేటాయించిన రూ.40 కోట్లూ ఇప్పటి వరకు విడుదల కాలేదు. మార్క్‌ఫెడ్‌కు రూ.250 కోట్ల బకాయిలపైనా ప్రభుత్వం మాట్లాడడం లేదు.

నాడు కంపెనీల నుంచి నేరుగా ఆర్బీకేలకు..
» వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్య­ంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేశారు. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరాకు ఏర్పాట్లు చేశారు. పైలట్‌ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమలు చేయగా, సమ­యంతోపాటు రవాణా, హ్యాండ్లింగ్‌ చా­ర్జీలు చాలా వరకు తగ్గాయి. గతంలో సొసైటీలకు ప్రాధాన్యం ఇస్తూనే ఆర్బీకేలకు ఏటా నిల్వలు పెంచుకుంటూ వెళ్లేవారు.

»  ఇలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనాలుగేళ్లలో 34.11 లక్షల మంది రైతులకు 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. ఫలితంగా లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. 2024 –25 సీజన్‌లోనూ 10 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

» అయితే సీజన్‌ ప్రారంభంలోనే పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా ఎరువుల సరఫరాను కుదించింది. ఫలితంగా గడిచిన ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి 50 టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)