Breaking News

బీచ్‌లో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తప్పేంటి?

Published on Wed, 06/17/2026 - 05:22

డాబాగార్డెన్స్‌ (విశాఖ): ‘విశాఖ బీచ్‌లో బీచ్‌ షాక్స్‌ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా..’ అని టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియా ద్వారా అబద్ధపు ప్రచా­రాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌లో  ‘బీచ్‌ షాక్స్‌’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు. గూగుల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనివ్వకుండా కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా అడ్డుకుంటున్నారని, అబద్ధపు ప్రచారాలు ఆపి, డేటా సెంటర్‌ను అడ్డుకోవద్దని సూచించారు. 

డేట్‌ సెంటర్‌ ఏర్పాటుతో 200 మీటర్ల పరిధిలో హీట్‌వేవ్‌ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రారంభంలో కన్‌స్ట్రక్షన్‌ సమయంలో 40 నుంచి 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని.. కన్‌స్ట్రక్షన్‌ పూర్తయిన తర్వాత వెయ్యిలోపే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎంపీ ఒప్పుకున్నారు. విశాఖలో ఉన్న ఎయిర్‌పోర్టును కొనసాగించాలన్నా..వద్దన్నా పూర్తి హక్కు జీఎంఆర్‌ దే అన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడితో నిర్మించిన.. భోగాపురం ఎయిర్‌పోర్టు జీఎంఆర్‌ కోసమేనంటూ ఎంపీ భరత్‌ చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనల మేరకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని ఎంపీ వెల్లడించారు. 

విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అంటున్నారని, అది కుదరదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. ఎవరు ఏం చెప్పినా విశాఖ విమానాశ్రయం ఉండదని చెప్పారు. పర్యావరణం పేరిట ఇటీవల బీచ్‌ రోడ్డులో చేపట్టిన సంతకాల సేకరణ (డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా)కు నగర పోలీస్‌ కమిషనర్‌ను పిలిచి మోసం చేశారని ఎంపీ తెలిపారు. సంతకాల సేకరణలో పాల్గొన్న సీపీని తాను ప్రశ్నించగా..పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమమని తనను ఆహ్వానించి మోసం చేసినట్టు తనతో సీపీ చెప్పారన్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)