Breaking News

నిలువునా దోచేయ్‌ ‘తమ్మి’...

Published on Tue, 07/22/2025 - 02:23

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇప్పటికే ఇసుకను ఆసాంతం తోడేశారు...! ఇప్పుడు గ్రావెల్‌పై పడ్డారు..!  
ఏలూరు జిల్లాలోని తమ్మిలేరును ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ముఠాలు ఎడాపెడా తవ్వేస్తున్నారు..! అది కూడా ఏరులోని గ్రావెల్‌ను కాకుండా గట్లను ధ్వంసం చేస్తుండడం గమనార్హం..! ఇద్దరు ప్రజాప్రతినిధుల పచ్చ ముఠాలు పోటీ పడి తవ్వకాలు చేపడుతూ విచ్చలవిడి విక్రయాలకు తెరతీశారు. పగలు, రాత్రి తేడా లేకుండా భారీ జేసీబీలతో తవ్వి నిత్యం వందల లారీల్లో గ్రావెల్‌ను  తరలిస్తున్నా అటు జల వనరుల శాఖ అధికారులు గాని,  ఇటు రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం. 

తెలంగాణలోని ఖమ్మం జిల్లా పోతువారిగూడెంలో ప్రారంభమై వందల మైళ్ల ప్రయాణంతో చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల మీదుగా ఏలూరు రూరల్‌ మండలం నుంచి ఏలూరులోకి ప్రవేశిస్తుంది తమ్మిలేరు. తూర్పు, పశ్చిమ తమ్మిలేరుగా విడిపోయి కొల్లేరులో కలిసే సహజ సిద్ధ కాల్వ ఇది.  

దశాబ్దాలకోసారి తమ్మిలేరుకు వరద వస్తుంది. దీంతో ఏలూరు నగరం జల దిగ్బంధం అవుతుంది. 1960 నుంచి 4–5 సార్లు ఇలా జరిగింది.  ఇలాంటి తమ్మిలేరుపై పచ్చ రాబందుల కన్నుపడింది. కూటమి ప్రభుత్వం  రాగానే విరుచుకుపడి దాదాపు 16 ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేసి వేల ట్రాక్టర్ల ఇసుకను విక్రయించారు. ఇప్పుడు గ్రావెల్‌పై పడ్డారు.

రోడ్డు వేసి మరీ..
ప్రత్యేక చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాల కనుసన్నల్లో తమ్మిలేరులోకి రోడ్డు వేసి  తవ్వేస్తున్నారు. ఏలూరు శివారు ప్రభుత్వ హౌసింగ్‌ వెంచర్‌ సమీపం నుంచి తమ్మిలేరులోకి రోడ్డు ఏర్పాటు చేశారు. వెంచర్‌ వద్ద నలుగురు మనుషులతో చెక్‌పోస్టు పెట్టారు. అక్కడ పనిచేసే సిబ్బంది, లారీ డ్రైవర్ల భోజన విరామం, షిప్టులు మారే సమయం మినహా రోజులో 18 నుంచి 20 గంటల వరకు అడ్డగోలు తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ జేసీబీలతో పది అడుగుల గట్లను తవ్వి లారీల్లో నింపుతున్నారు. ఒక్కో లారీ గ్రావెల్‌ను సగటున రూ.7 వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. 

⇒ పెదవేగి మండలం వంగూరు సమీపంలోని తమ్మిలేరులో తవ్వకాలు నిరంతరం సాగుతున్నాయి. ఓ ఎమ్మెల్యే ముఠా ప్రధాన రహదారి వెంట పట్టపగలే ప్రైవేటు సెక్యూ­రిటీ నడుమ గ్రావెల్‌ దందా కొనసాగిస్తోంది. దాదాపు కిలోమీటరు పైగా గట్టును ధ్వంసం చేసి వందల టిప్పర్లల్లో తరలించారు. 

⇒ అక్కడనుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో మరో ఎమ్మెల్యే ముఠా తమ్మిలేరు గ్రావెల్‌ను, సిల్ట్‌ ఇసుకను తవ్వుతోంది. జానంపేటలోని పోలవరం అక్విడెక్ట్‌ దాటిన తర్వాత ఇదే తరహాలో ప్రత్యేక టీమ్‌ పర్యవేక్షణలో రాత్రింబవళ్లు తవ్వకాలు సాగించి గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు. 

⇒ ఏలూరు శివారులోని పచ్చ ముఠా ఏలూరు,కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో, జానంపేటలోని మరో ముఠా దెందులూరు, చింతలపూడి, నూజివీడులో విక్రయాలు సాగిస్తుస్తోంది.  
⇒రోజూ రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన గ్రావెల్‌ను దోచుకుంటున్న సంగతి అధికారులకు తెలిసినా కనీసం కేసులు కూడా లేకపోవడం గమనార్హం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)