Breaking News

టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఓవరాక్షన్‌

Published on Fri, 06/12/2026 - 05:35

కడప కార్పొరేషన్‌: కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.మాధవీరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలను ఆమె తరచూ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా గురువారం కడప నగరంలోని 47వ డివిజన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మె­ల్యే మాధవీరెడ్డి మాజీ మేయర్‌ పాకా సురేష్‌ ఇంటిముందు ఇంటర్‌ లాకింగ్‌ టైల్స్‌ వేసి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.

వెంటనే అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌చంద్ర, టౌన్‌ ప్లానింగ్‌ అ«ధికారులు పాత తేదీతో స్థానికులు ఫిర్యాదు చేసినట్టు ఒక పత్రాన్ని సృష్టించి ఆగమేఘాలపై జేసీబీని రప్పించి మాజీ మేయర్‌ సురేష్‌ ఇంటిఎదుట ఉన్న ఇంటర్‌ లాకింగ్‌ టైల్స్, ర్యాంపును తొలగించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మాజీ కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని వారి వాటర్‌ ప్లాంట్లను ఎమ్మెల్యే ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేసినందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డికి చెందిన షాపుల ఎదుట ఉన్న ర్యాంపులను జేసీబీతో తొలగింపజేశారు. ఇటీవల ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్‌ కాలేజీ ఎదుట కాలువ ఉందన్న నెపంతో కాలేజీ ముందు వైపు ఉన్న తాపలను జేసీబీతో కూల్చివేయించారు.  

నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం 
తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిముందు వేసుకున్న టైల్స్, ర్యాంపును తొలగించడం అన్యాయమని మాజీ మేయర్‌ పాకా సురేష్‌ సతీమణి రాధిక అన్నారు. చాలా ఏళ్లుగా ఇవి ఉన్నాయని, స్థానికులకుగానీ, ఈ దారి వెంట వెళ్లే వారికిగానీ ఇబ్బంది కలిగించలేదన్నారు. అయినప్పటికీ గ్రీవెన్‌ సెల్‌లో ఫిర్యాదు వచ్చిందంటూ జేసీబీ తెచ్చి కూల్చివేయడం దారుణమన్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)