Breaking News

‘నేను సత్యవేడు ఎమ్మెల్యేను.. ఇదిగో నా రాజముద్ర.’

Published on Tue, 07/15/2025 - 10:13

సత్యవేడు: ‘నేను సత్యవేడు ఎమ్మెల్యేను .. ఇదిగో నా రాజముద్ర.’ అంటూ కోనేటి ఆదిమూలం తన ఎమ్మెల్యే ఐడెంటీ కార్డును పార్టీ నాయకులు, అధికారులు, విలేకరులకు చూపారు. సత్యవేడులో సోమవారం అన్నా క్యాంటిన్‌ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తనని ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు చేసిన మాజీ ఎమ్మెల్యే హేమలత, ప్రత్యర్థి పార్టీకి పనిచేసిన వారు నేడు టీడీపీ కార్యక్రమాల్లో స్టేజీలపై ముందు వరుసలో కూర్చొంటున్నారన్నారు. 

టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు సమావేశాల్లో కింద వరుసలో ఉన్నారని, తగుదునమ్మా అంటూ హేమలత, సతీష్‌ నాయుడు పలు మండలాల్లో పార్టీ కార్యక్రమాల్లో తిరగడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. తన పదవి  తన దగ్గర ఉంటుందని, ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పంపిణీ తన ద్వారానే జరుగుతుందన్నారు. అలాగే పార్టీ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌గా కూరపాటి  శంకర్‌ రెడ్డి ఉంటారన్నారు.  

స్నేహితుడా న్యాయమేనా..?  
సీఎం చంద్రబాబు నాయుడు ‘నీన్ను టీడీపీ ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ గా నియమించారు. స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న నన్ను వదిలేసి.. ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్రలు పన్నిన హెచ్‌.హేమలత, చెరుకు పార్టీ వాళ్లని వెంట పెట్టుకుని తిరుగుతున్నావు. మండలాల్లో మీరు చేపట్టే కార్యక్రమాలకు నాకు ఆహా్వనం లేదు. అందరం పార్టీ కోసం పనిచేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలు వద్దు.. అందరం కలసి సత్యవేడులో పార్టీ అభివృద్ధికి చేయి కలుపుదాం స్నేహితుడా.. శంకర్‌ రెడ్డి.’ అంటూ హితబోధ చేశారు.


    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)