Breaking News

దివ్యాంగుడిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె అనుచరుల జులుం

Published on Wed, 08/30/2023 - 03:36

పటమట(విజయవాడతూర్పు): ‘రూ.2వేలు ఇస్తామని చెప్పి లోకేశ్‌ యువగళం పాదయాత్రకు తీసుకువెళ్లారు. వెళ్లిన తర్వాత కేవలం రూ.500 ఇచ్చి మోసం చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు బెదిరిస్తున్నారు. దాడికి ప్రయత్నించారు.’ అని విజయవాడ తూ­ర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్‌ దుర్గారావుపై పటమట కృష్ణానగర్‌కు చెందిన గద్దె తంబి అనే దివ్యాంగుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇందుకు సంబంధించిన వివరాలు... ‘ఈ నెల 20వ తేదీన విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో జరిగిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు వస్తే రూ.2వేలు ఇస్తామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ నాకు చెప్పారు. అయితే, కేవలం రూ.500 మాత్రమే ఇచ్చారు..’ అని గతంలో తంబి చెప్పిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అనుచరుడు, కార్పొరేటర్‌ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్‌ దుర్గారావు సోమవారం సాయంత్రం అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు తనను తీసుకువెళ్లారని తంబి ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్కడ తనతో బలవంతంగా ఎమ్మెల్యేకు అనుకూలంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని తెలిపారు. ఈ స్టేట్‌మెంట్‌ను సోషల్‌ మీడియా­లో పెట్టడంతో తాను ప్రశ్నించానని, దీంతో తనపై దాడికి ప్రయత్నించారని తంబి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. తనను బెదిరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ముమ్మినేని ప్రసాద్, దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఐ కాశీవి«శ్వనాథ్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)