Breaking News

అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం.. మహిళపై దాడి

Published on Tue, 09/10/2024 - 16:30

సాక్షి, నంద్యాల: ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే పచ్చ మంద.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇక, తాజాగా నంద్యాల జిల్లాలో అఖిలప్రియ మద్దతుదారులు మహిళలపై భౌతిక దాడులు చేస్తున్నారు.

ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి కబ్జాలు చేస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కొండయ్య కూతురిపై పచ్చ మంద విరుచుకుపడింది. అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి ఆమెను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. చేయి విరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

నా టార్గెట్‌ వంద మంది: అఖిలప్రియ
కొన్ని రోజుల క్రితమే తనకు ఓ రెడ్‌ బుక్‌ ఉంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు. వంద మందిని మాత్రం వదిలిపెట్టే ​ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను అంటూ బహిరంగంగానే వార్నింగ్‌ ఇచ్చారు. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)