Breaking News

పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి..

Published on Wed, 07/30/2025 - 07:38

సాక్షి, కోనేరు సెంటర్‌: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక దుర్మార్గమైన పంచాయితీకి తెరతీశారు. యువతిని మోసగించిన టీడీపీ నేత, మంత్రి అనుచరుడి కుమారుడి తరఫున రంగంలోకి దిగారు. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  

వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల్లో ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌లీడర్‌ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్‌ స్థానికంగా ఒక యువతిని ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లా­డు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్‌ బలవంతంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోందని వారు తమ ఫిర్యా­దులో పేర్కొన్నారు.

దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్‌ను గోవాలో పట్టుకున్నారు. అతడిని, ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్‌ నిరాకరించాడు. సుబ్ర­హ్మణ్యం రంగంలోకి దిగి, యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువతి తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందనే భయంతో ఆ యువతి తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)