Breaking News

పది వేలిస్తేనే.. ఇసుక లోడింగ్‌

Published on Tue, 12/24/2024 - 04:50

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుక దందా యథేచ్ఛంగా సాగుతోంది. రూ.10 వేలు ఇస్తేనే ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. ఇక్కడంతా టీడీపీ ఎంపీ ఒకరి అనుచరుల దందానే.  పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌ చేసుకొన్నా తట్టెడు ఇసుక దొరకదు. చలానాకు ఇసుక దొరకదని కరాఖండిగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టజెబితే దండిగా ఇసుక లోడ్‌ చేస్తారు.

టీడీపీ ఎంపీ పీఏలుగా వ్యవహరిస్తున్న జగదీష్, కిశోర్‌లే ఈ రీచ్‌లను పర్యవేక్షిస్తున్నారు. ఓ లారీ యజమానికి, ఇసుక రీచ్‌లో ఉన్న మనుషులకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ బయటకు రావడంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలం వేములపల్లి, పెండ్యాల, కాసరబాద రీచ్‌లను వీరు గుప్పిట్లో పెట్టుకొని లారీకి రూ.10 వేలు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుక ఎత్తిపోస్తున్నారు. అంతే కాకుండా, రోజుకు 200కు పైగా లారీల ఇసుక అక్రమంగా ఖమ్మం, వైరా, హైదరాబాద్, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకొంటున్నారు.

ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే 8 స్టాకు యార్డుల్లో ఉన్న ఇసుకను టీడీపీ నాయకులు లూటీ చేశారు. ఇక్కడ 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను మింగేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీని వెనుక జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధుల  హస్తం ఉందన్న విమర్శలు వచ్చాయి.  ఇప్పుడు ఇసుక రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకొని రేటు కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు.

#

Tags : 1

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)