కూటమి నేతల వర్గ విభేదాలతో కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు గుండెపోటు

Published on Sat, 06/28/2025 - 08:55

(అనకాపల్లి జిల్లా)బుచ్చెయ్యపేట: కూటమి నేతల పంతాలు, పట్టింపులు అధికారుల ప్రాణం మీదకు తెస్తున్నాయి. ఎమ్మెల్యే తన వర్గీయులకు సీటు ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌ను తన కార్యాలయానికి పిలిపించి బెదిరించగా.. ప్రిన్సిపాల్‌ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో శుక్రవారం జరిగింది. బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు వర్గం, రాష్ట హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు(టీడీపీ నేత) వర్గం పోటీ పడ్డాయి. 

ఇరువర్గీయులు ప్రిన్సిపాల్‌ కె.అన్నపూర్ణపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే చివరికి ప్రిన్సిపాల్‌ తాతయ్యబాబు వర్గం సూచించిన బాలికకు సీటు కేటాయించారు. తమ మాట చెల్లకపోవడంతో ఎమ్మెల్యే రాజు వర్గీయుడు గురువారం కేజీబీవీకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను బెదిరించాడు. ‘ఎమ్మెల్యే చెప్పిన వారికి సీటు ఇవ్వవా.. నీవు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాం. స్కూల్‌ గేటు ఎలా దాటతావో చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే కార్యాలయానికి రప్పించారు. 

‘ఎవరి ప్రోద్బలంతో ఆ సీటును కేటాయించారు? ఎమ్మెల్యే అంటే లెక్కలేదా’ అంటూ ఎమ్మెల్యేతో సహా కూటమి నాయకులు బెదిరించడంతో ఆమె ప్రాణభయంతో గుండెపోటు, ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ భర్త కామేశ్వరరావు ఆస్పత్రికి చేరుకుని కూటమి నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)