Breaking News

సచివాలయాన్ని ఎత్తేశాడు

Published on Thu, 10/31/2024 - 05:33

ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల అధర్మ ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తాము చెప్పినచోటే సచివాలయం పనిచేయాలంటూ ఏకంగా కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను తరలించేశారు. దీంతో ఆ సచివాలయం ఉద్యోగులు మరో వార్డు సచివాలయానికి వెళ్లి పనిచేస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని 39వ వార్డులో ఈ దురాగతం జరిగి వారం రోజులైనా మున్సిపల్‌ అధికారులు స్పందించకపోవడం విమర్శనీయంగా ఉంది. 39వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్‌ కేతా శ్రీను కొద్దిరోజులుగా సచివాలయ సిబ్బంది తాను చెప్పినట్లుగానే వినాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు.

వార్డులోని 37వ నంబరు సచివాలయాన్ని తాను చెప్పినచోటుకు మార్చాలని హుకుం జారీచేశాడు. అతడు చెప్పిన ప్రదేశం వార్డు ప్రజల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సచివాలయాన్ని ఉన్నచోటే కొనసాగించాలని స్థానిక బీజేపీ నాయకుడు జింకా చంద్రశేఖర్, వార్డు ప్రజలు కోరారు. అయినా తనమాటే చెల్లాలంటూ కేతా శ్రీను వారం రోజుల కిందట సచివాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. వాటిని మరో ఇంట్లో ఉంచి సచివాలయ సిబ్బంది అక్కడికొచ్చి పనిచేయాలని నిర్దేశించాడు. ఈ విషయాన్ని మునిసిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లిన సచివాలయ సిబ్బంది మూడురోజులు రామ్‌నగర్‌ సచివాలయం నుంచి పనిచేశారు.

తరువాత వార్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో 40 వార్డులోని తారకరామాపురంలో ఉన్న 38వ నంబరు సచివాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పనుల మీద ఇప్పటివరకు సచివాలయం ఉన్న చోటుకు వెళ్లిన ప్రజలు ‘ఇక్కడి మా సచివాలయం ఏది?’ అని ప్రశ్నిస్తున్నారు తనకు ప్రభుత్వం నుంచి ఆరునెలల అద్దె రావాల్సి ఉందని, కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా సచివాలయాన్ని ఖాళీచేయడం దారుణమని భవన యజమాని కడప రంగస్వామి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ను అడిగేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలోనే టీడీపీ నేత ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)