Breaking News

కామ మాంత్రికుడికి టీడీపీ నేతల పరామర్శ 

Published on Thu, 05/25/2023 - 04:58

రేణిగుంట(తిరుపతి జిల్లా): రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల పేరుతో ఓ మహిళపై బలాత్కారానికి యత్నించిన కామ మాంత్రికుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ నేతలు తిరుపతి సబ్‌ జైల్లో పరామర్శించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎస్టీ సెల్‌ తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ఉన్న సుబ్బయ్య శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేటలో భూత మాంత్రికుడి అవతారం ఎత్తి దాదాపు పదేళ్ల నుంచి మంత్రాలు, తాయ­త్తులు కడుతూ ప్రజల మూఢ విశ్వాసాలను సొమ్ముచేసుకునే వాడు.

తాంత్రిక పూజల ముసుగులో అతని అకృత్యా­లు నిత్యకృత్యమైనా.. ఎవ్వరూ అతనిని ఎదిరించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ఈ నెల 14న రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల నెపంతో ఓ మహిళను నగ్నంగా పూజలో కూర్చోవాలని బలవంతం చేసి ఆమె నిరాకరించడంతో బలాత్కారం చేశాడు. ఈ ఘటనతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్బయ్యను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

కాగా, సబ్‌ జైల్లో ఉన్న నిందితుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, టీడీపీ పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శ్రీపతిబాబు, రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మనోహర్‌నాయక్, అమాస శివకుమార్‌లు కలిసి అరగంటకు పైగా అతనితో మంతనాలు జరిపారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలుస్తుందని ఆయనకు భరోసా ఇచ్చారు. మహిళపై అకృత్యానికి పాల్పడి అరెస్టయిన సుబ్బయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారని టీడీపీ వర్గాలే భావించాయి.

అయితే అనూహ్యంగా జైల్లో ఉన్న అతన్ని కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చీదరించుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి బలహీనతలు సుబ్బయ్యకు బాగా తెలుసని, అవెక్కడ బయటపడతాయోనని పార్టీ వర్గాలు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)