Breaking News

సచివాలయం, ఆర్‌బీకే, ఆస్పత్రికి తాళమేసిన టీడీపీ నేతలు!

Published on Sat, 10/12/2024 - 03:27

పలమనేరు: టీడీపీ నేతల అరాచకాలు రోజురో­జుకు పెరిగిపోతున్నాయనేందుకు గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రి సిబ్బందిని బలవంతంగా బయటకు పంపి.. ఆయా కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటన అద్దం పడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జగమర్లలో గురువారం సాయంత్రం చోటుచేసుకోగా.. శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం రచ్చబండ వద్ద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించింది. 

ఈ కార్యాలయాల్లో మొత్తం 16మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. గతంలో ఈ కార్యాలయాలకు దారితోపాటు.. సీసీ రోడ్డును సైతం గత ప్రభుత్వమే నిర్మించింది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీకి చెందిన రెడ్డెప్పరెడ్డి సోదరుల పట్టా భూమిలో నుంచి దారి ఇవ్వాలంటూ గురువారం వాగ్వాదానికి దిగారు. 

ఇప్పటికే దారి ఉన్నప్పటికీ తన పట్టా భూమిలో ఎందుకు దారి వదలాలని సంబంధిత రైతు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన  పచ్చనేతలు దుర్భాష­లాడుతూ.. కార్యాలయాల్లోని సిబ్బందిని బయ­టకు పంపి.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రికి తాళాలు వేశారు. కోరినచోట దారి కల్పిస్తేనే కార్యాలయాలు తెరుస్తామంటూ హెచ్చరించారు.  దీనిపై గ్రామ సర్పంచ్‌ విజయ్‌­రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)