Breaking News

పచ్చదోపిడీ ఖనిజం

Published on Fri, 02/13/2026 - 06:17

తాడిపత్రి టౌన్‌/ పెద్దవడుగూరు: అధికార అండతో ‘పచ్చ’ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఖనిజ తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నారు. ఆదాయం తప్ప భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా గనులు నిర్వహిస్తూ కార్మీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైనింగ్‌ మాఫియాగా ఏర్పడి  చెలరేగిపోతున్నారు.  అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో స్టీటైట్‌ అనే ఖనిజ సంపద ఉంది. ఇక్కడ దాదాపు 42 గనులు ఉన్నాయి. టీడీపీకి చెందిన వారే ఎక్కువగా లీజు పొందారు. ఈ గనుల్లో 600 మంది దాకా కార్మికులు పనులు చేస్తున్నారు. భూగర్భ గనుల నిర్వహణలో కార్మికుల భద్రత చాలా ముఖ్యం.

కార్మీకులు హెల్మెట్, బూట్లు, హెడ్‌లైట్‌లు ధరించాల్సి ఉంటుంది. సొరంగంలో కొంత దూరం వెళ్లాక తగినంత గాలి, వెలుతురు కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొండుపల్లి గనుల్లో ఇలాంటి భద్రతా ప్రమాణాలు ఏవీ కనిపించవు. ఖనిజం వెలికితీసే ప్రక్రియల్లో మందుగుండు (జిలెటిన్‌స్టిక్స్‌) సామగ్రి ఉపయోగిస్తారు. ఇందుకు గాను మైనింగ్‌కు అర్హులైన మేనేజర్, మేట్, బ్లాస్టర్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇదంతా రికార్డుల్లో మాత్రమే పొందుపరుస్తారు. వాస్తవంలో ఎవ్వరూ ఉండరు. నైపుణ్యం లేని కార్మికులతోనే జిలెటిన్‌ స్టిక్స్‌పెట్టిస్తూ.. ఖనిజాన్ని వెలికితీస్తున్నారు.   

అనుమతికి మించి జిలెటిన్‌స్టిక్స్‌ వినియోగం 
సాధారణంగా భూగర్భ గనుల్లోంచి ఖనిజం బయటకు తీసేందుకు మందుగుండు (జిలెటిన్‌స్టిక్స్‌) సామగ్రిని రోజుకు కేజీల లెక్కల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ టన్నుల్లో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉపయోగిస్తూ     ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఇలా విచ్చల విడిగా పేలుళ్లు జరిపే క్రమంలో కార్మికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. గనుల్లో ప్రమాదం జరిగి కార్మీకుల మరణాలు సంభవించినా, కాళ్లు, చేతులు పోగొట్టుకున్నా బాధిత కుటుంబాలకు డబ్బు ఆశచూపి విషయం      బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొండుపల్లిలో ఈ నెల రెండో తేదీన అనుమతి లేని గనిలో ప్రమాదం జరిగి ఇద్దరు  కార్మీకులు     తీవ్రంగా గాయపడ్డారు.  

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి 
నిబంధనలు ఉల్లంఘించినా మైనింగ్‌ నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. వారిచ్చే మామూళ్లు తీసుకుని పట్టనట్టుగా ఉంటున్నారు. అనుమతికి మించి స్టీటైట్‌ తవ్వకాలు చేపట్టి పౌడర్‌ ఫ్యాక్టరీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్టీ ఎగ్గొడుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కొండుపల్లిలోని 688, 697, 698, 699 సర్వే నంబర్లలో అక్రమంగా మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. 693, 694, 695 సర్వే నంబర్లలోని మైనింగ్‌ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా 25 వేల టన్నుల ఖనిజం తరలించినట్లు గుర్తించిన అధికారులు 2022 మార్చి 21న రూ.6.41 కోట్ల జరిమానా విధిస్తూ గని సీజ్‌ చేశారు. అయితే నిర్వాహకులు ఆ గనిలో ఇప్పటికీ యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూనే ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)