Breaking News

గణపతి గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే

Published on Tue, 08/12/2025 - 06:02

చిత్తూరు కలెక్టరేట్‌: చిత్తూరు జిల్లాలోని నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్నాయుడు ధోరణి పట్ల ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. తమ ప్రాంతంలో నిర్మిస్తున్న వినాయకస్వామి ఆలయ నిర్మాణాన్ని ఆపే హక్కు ఎవరిచ్చారని టీడీపీ సీనియర్‌ నాయకుడు రామానుజం చలపతి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆలయ హుండీ, చంద్రబాబునాయుడు చిత్రపటాలను చేతిలో పెట్టుకుని ధర్నా చేశారు.

ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నిర్మిస్తున్న వినాయకస్వామి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో  గాలి భానుప్రకాష్‌ నాయుడు పాత్ర ఉందని విమర్శించారు. నగరిపేటలో కొత్తగా ఏర్పాటైన కాలనీలో గతంలో వినాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టామని, అయితే ఆర్థిక కారణాలతో పనులు ఆగాయని, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి రావడంతో నగరిపేట ప్రాంత వాసులు కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకుని తాజాగా ఆలయ పనులు ప్రారంభించారని, అయితే ఈ గుడి నిర్మాణం నిలిపివేయాలంటూ నలుగురు ఫిర్యాదు చేశారని, దీంతో నగరి తహసీల్దార్‌ పనులను అడ్డుకున్నారని వివరించారు.

దీనివెనుక ఇద్దరు టీడీపీ నేతలు ఉన్నట్టు తెలిసిందని, ఆ ఇద్దరి వెనుక నగరి ఎమ్మెల్యే హస్తముందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కలెక్టర్‌ జోక్యం చేసుకొని గుడి నిర్మాణానికి ఆటంకాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం చేయకుంటే  పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో నగరి మున్సిపాలిటీ మహిళా మాజీ కౌన్సిలర్‌ లత, ఇతర మహిళా నాయకులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)