Breaking News

రామోజీ... కళ్లు కనిపించడం లేదా? మేం బతికే ఉన్నాం 

Published on Fri, 02/02/2024 - 05:42

ఉన్నవి లేనట్టు... లేనివి ఉన్నట్టు పచ్చ పత్రిక అడ్డగోలు రాతలతో భ్రమింపజేస్తోంది. ఓటర్ల జాబితాలో ఉన్నవారు చనిపోయినట్టు చిత్రీకరిస్తోంది. ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకలేనని నిర్ధారించేస్తోంది. ఎలాగోలా చంద్రబాబునాయుడును గద్దెనెక్కించడమే తమ లక్ష్యంగా దిగువస్థాయి నుంచి రామోజీ వరకూ అడ్డగోలు రాతలతో జనాన్ని తప్పుదారి పట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తప్పులు లేని ఓటర్‌ జాబితా తయారు చేసింది.  – సాక్షి, నంద్యాల

అక్రమాలకు తెరతీసిన టీడీపీ 
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఓటర్ల అక్రమాలకు తెరలేపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ సాయంతో గంపగుత్తంగా ఓటు హక్కు కోసం ఫారం–6లు నమోదు చేశారు. ఓటర్‌ జాబితాలో అనర్హులను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఫారం–7లను బూత్‌ స్థాయి అధికారులకు, ఎలక్ట్రోరల్‌ రిజి్రస్టేషన్‌ అధికారుల కార్యాలయాల్లో అందజేశారు. దురుద్దేశంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వచ్ఛమైన తుది ఓటరు జాబితా రూపొందించారు. అయితే ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ విషం కక్కుతోంది. 

పచ్చ పత్రిక పిచ్చి రాతలు 
పాణ్యం: పచ్చ పత్రిక విషపూరిత రాతలతో జనాన్ని పిచ్చెక్కిస్తోంది. లేనిపోని రాతలతో తప్పుదారి పట్టిస్తోంది. పాణ్యం నియోజకవర్గంలోని 131వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆర్‌.జయరామ్, అతని భార్య ఆర్‌.రేణుకలకు ఓటు హక్కు ఉంది. వీరు అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత సొంతింట్లోకి మారిన తర్వాత ఆర్‌.జయరామ్‌ మరణించారు.

131 బూత్‌లో ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని ఆర్‌.రేణుక ఫారం–7 ద్వారా అభ్యర్థించారు. పరిశీలించిన బీఎల్‌ఓలు ఆమె ఓటు(ఎన్‌కేడీ నంబర్‌ 2458899)ను జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం 130 పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు నమోదైంది. అయితే భర్తతో పాటు భార్యకు కూడా 131లో ఓటు హక్కు తొలగించారని రాశారు. వాస్తవానికి ఆమె అభీష్టం మేరకే 131 బూత్‌లో భర్త ఓటు తొలగించి ఆమె ఓటును మార్చడం గమనార్హం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)