Breaking News

అన్న వస్తున్నాడు .. కోడిగుడ్డు కూర వండు !

Published on Mon, 03/31/2025 - 07:06

సత్తెనపల్లి: ఏం మేడం ఏం చేస్తున్నారు .. అన్న వస్తున్నాడు .. కోడి గుడ్డు కూర వండు అంటూ ఓ గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తకు టీడీపీ నాయకుడి అనుచరుడు ఫోన్‌ చేసి వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తకు అదే గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి పక్కన ఉండే అనుచరుడు మూడు రోజుల కిందట ఫోన్‌ చేసి వేధింపులకు గురి చేశాడు. 

ఈ రోజు అన్న మీ ఇంట్లోనే ఉంటాడని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడని, అన్న ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు తెలుసుగా ? అంటూ ఘీంకరించాడు. దీంతో ఏం చేయాలో పాలు పోక అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడిన మాటలు అన్నీ ఆమె రికార్డింగ్‌ చేసింది. వాటిని గ్రామానికి చెందిన మరో అధికార పార్టీ నాయకుడు దృష్టికి తీసుకెళ్లింది.  దీంతో ఆయన ఆమెను వెంటబెట్టుకొని ఎమ్మెల్యే వద్దకు తీసుకువచ్చాడు. 

ఆ వీడియో వినిపించగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఎమ్మెల్యే వద్దకు వచ్చిన సంగతి తెలియడంతో గ్రామంలో ఫోన్‌ చేసిన వ్యక్తికి పార్టీ నేతలే స్వల్పంగా దేహశుద్ధి చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని ప్రాథేయపడటంతో కేసు నమోదు చేయకుండా రాజీమార్గం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉగాది పర్వదినాన ఆదివారం బయటకు రావడంతో పట్టణం, మండలంలో చర్చనీయాంశంగా మారింది.

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)