Breaking News

ఎన్ని గుండెలు.. మమ్మల్నే ఎదిరిస్తావా..?

Published on Sun, 01/04/2026 - 05:28

రేణిగుంట: మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నా­రనే కారణంతో అధికార టీడీపీ నాయకులు వీఆ­ర్వోను మభ్యపెట్టి తమతో తీసుకెళ్లి హత్యాయ­త్నానికి యత్నించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. రేణిగుంట మండలంలోని కృష్ణాపురం వీఆర్వో సాయికుమార్‌  శనివారం రాత్రి రేణిగుంట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం  వెంకటాపురం పంచాయతీ­లోని అంకమ్మ నాయుడు మిట్ట లో శుక్రవారం సాయంత్రం జేసీబీ, ట్రాక్టర్లతో మట్టి అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు రెవెన్యూ అధికారులకు  సమాచారం అందించారు. 

దీంతో వెంకటాపురం వీఆర్వో రామ్‌ చరణ్‌ తేజ్, కృష్ణా­పురం వీఆర్వో సాయికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్నా­రు. అయితే ఆర్‌. అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, సింగల్‌ విండో డైరెక్టర్‌ గజేంద్ర రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, సురేంద్ర  వీఆర్వోల విధులకు ఆటంకం కలిగిస్తూ జేసీబీ, ట్రాక్టర్లను సీజ్‌ చేయకుండా అడ్డగించారు. ఎన్ని గుండెలు.. మమ్మల్నే ఎదిరిస్తారా..?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాత్రి సమయం కావడంతో ఈ విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేసి వీఆర్వోలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

రెండు గంటలు నిర్బంధం, బెదిరింపులు 
అయితే అర్ధరాత్రి 12.15 గంటల సమ­యంలో, సోమశేఖర్‌ రెడ్డి వీఆర్వో సాయికుమా­ర్‌­కు ఫోన్‌ చేశాడు.  ‘నీతో మాట్లాడాలి’ అని చెప్పి రేణిగుంట బ్రిడ్జి వద్ద గల ఒక హోటల్‌ దగ్గరకు పిలిపించాడు. అక్కడి నుంచి తన కారులో వీఆ­ర్వోను తీసుకెళ్లి డాలర్స్‌ కాలనీ, పాత రేణిగుంట ప్రాంతంలో సుమారు రెండు గంటలు నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డాడు. తరువాత గజేంద్ర రెడ్డి, సురేంద్ర కూడా సాయికుమార్‌ను నిర్భందించిన చోటుకు వచ్చారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. చంపుతామని బెదిరించారు. మరో వీఆర్వో రామ్‌ చరణ్‌ తేజ్‌ నివాసం చూపించాలని బలవంతం చేశారు. అనంతరం తిరుపతి వరకు తిప్పి ఉదయం సుమారు 5 గంటలకు రేణిగుంట పట్టణంలో వదిలి వెళ్లారు.  ఈ ఘటనను రెవెన్యూ ఉన్నత అధికారులకు తెలియజేసి, వారి సూచనల మేరకు రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌లో సాయి­కుమార్‌  ఫిర్యాదు చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)