Breaking News

ఇసుక తరలిస్తా.. అడ్డుకోవద్దు!

Published on Mon, 01/27/2025 - 05:16

శింగనమల: ‘నేను టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ­ణికి కుడి భుజం. ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఆ ఇసుక తోలుతున్నాం. అడ్డుకుంటే ఇక నీ ఇష్టం...’ అంటూ ఓ టీడీపీ నాయకుడు... వీఆర్వోను బెదిరించాడు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బాధిత వీఆర్వో ఆది­వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలు... అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకంచెర్వు–కొరివిపల్లి మార్గ­ం­లోని చీలేపల్లి వంక నుంచి కొన్ని రోజు­లుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావ­డంతో రెవెన్యూ అధికారులు స్పందించి టీడీపీ నాయ­కులు నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్‌ చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాచేపల్లి వీఆర్వో నాగేంద్రకు అప్పగించారు. 

అయితే, సీజ్‌ చేసిన ఇసుకను దౌర్జన్యంగా తరలించడానికి ఈ నెల 12న టీడీపీ నాయకులు జేసీబీ, టిప్పరుతో రాగా, వీఆర్వో అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీఆర్వోకు నార్పల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్‌ ఫోన్‌ చేసి రెచ్చి­పోయాడు. ‘ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఇసుక తోలు­తు­న్నాం. సీఐకి కూడా ముందే చెప్పాం. సీజ్‌ చేసిన ఇసుకను తరలించి తీరుతాం. 

ఎమ్మెల్యే చెప్పినా లెక్క లేదా? రాత్రికి వచ్చి ఇసుక తరలిస్తాం..’ అని బెదిరించాడు. ‘సీజ్‌ చేసిన ఇసుకను తరలించడం తప్పు కదా అన్నా’ అని వీఆర్వో చెప్పగా... ‘ఎలా తప్పవుతుంది..? ఈ మాటలన్నీ రికార్డు చేసు­కున్నా నాకేమీ ఇబ్బంది లేదు...’ అంటూ నరసింహ యాదవ్‌ రెచ్చిపో­యాడు. 

ప్రస్తుతం ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో భయాందోళనలకు గురైన వీఆర్వో నాగేంద్ర మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసింహ యాదవ్‌పై కేసు నమోదు చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)