Breaking News

మహిళకు టీడీపీ నేత లైంగిక వేధింపులు

Published on Sun, 01/04/2026 - 04:26

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: తమ చేష్టలతో శ్రీశైలం క్షేత్ర ప్రతిష్టతను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారు. ఉద్యోగం కోసం ఓ మహిళ శ్రీశైలం టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వద్దకు రాగా, ఆమెతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరికను తీర్చితే ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను వేధించాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ నేతలు తమకు తెలియకుండా ఏ పని జరగకూడదని అధికారులకు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల అరాచకాలకు భయపడిన అధికారులు వారు చెప్పినవారికే కాంట్రాక్టులు, ఉద్యోగాలు ఇస్తున్నారు.

ఇటీవల శ్రీశైలానికి చెందిన మహిళ తన కుటుంబ పోషణ నిమిత్తం తనకు దేవస్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించింది. ఆ మహిళపై కన్నేసిన శ్రీనివాసరెడ్డి..తాను ఏది చెబితే అదే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వద్ద ఫైనల్‌ అవుతుందని, తన కోరిక తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను వేధించాడు. అంతేకాకుండా ఆ మహిళకు వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీనివాసరెడ్డి తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)