Breaking News

అసలే కరువు.. ఆపై చేతివాటం

Published on Sun, 10/06/2024 - 05:24

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో నాలుగున్నర టన్నులు పట్టే ట్రాక్టర్‌ ఇసుక రూ.9 వేలు, రూ.10 వేల చొప్పున అమ్ముతున్నారు. అంత ధర పెట్టి కొనుగోలు చేద్దామంటే కూడా నూటికి పది మందికి కూడా దొరకడంలేదు. దీంతో చాలా మంది పనులు ఆపుకున్నారు. చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల నుంచే కాక వరద కాలువ గట్లలోని ఇసుకను కూడా టీడీపీ నేత ఒకరు అక్రమంగా తరలించి అమ్ము కుంటున్నాడు.

 రేపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వేమూరు నియోజకవర్గంలోని జువ్వలపాలెం, ఓలేరు, పెసర్లంక, గాజుల్లంక గ్రామాల పరిధిలో కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని కృష్ణా నది నుంచి 300 ఎద్దుల బండ్లలో ఇసుకను తరలిస్తున్నారు. వెల్లటూరు, కొల్లూరు, పెదపులివర్రు గ్రామాల సమీపంలోని కరకట్టకు వెలుపల గుట్టగా పోసి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. బాపట్లలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పని దొరక్క తిరిగొచ్చేస్తున్నాం
నేను తెనాలి, గుంటూరులో పను­లకు వెళతాను. కొంత కాలంగా ఇసుక అందు­బాటు­లో లేక పోవడంతో సక్రమంగా పనులు జరగడం లేదు. పనికి వెళ్లిన తర్వాత ఇసుక లోడు రాకపోవడంతో పని నిలిపి వేశా­మని నిర్మాణ దారులు చెబుతున్నారు. రోజూ పనికి వెళ్లే వారిలో పది శాతం మందికి కూడా పనులు దొరకడం లేదు. అంత దూరం వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తున్నాము. 
– డి.రవీంద్రనాథ్, రాడ్‌ బెండింగ్‌ మేస్త్రీ, వరహాపురం, వేమూరు మండలం

ఉపాధి కరువైంది
మా ప్రాంతంతో పాటు తెనాలికి పనుల కోసం వెళతాము. కొంత కాలంగా ఇసుక కొరత వల్ల పనులు అందరికీ దొరకడం లేదు. పని కోసం వెళితే ఇసుక దొరకడం లేదని కట్టుబడి దారులు చెబుతున్నారు. బయట కూడా పనులు లేవు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.– కట్ట మరియదాసు, బేల్దార్‌ మేస్త్రీ,  బలిజేపల్లి, వేమూరు మండలం

ప్రత్యేక సాయం ప్రకటించాలి
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక సరఫరాలో అంతరా­యంతో ఇబ్బందులు పడు­తు­­­న్నాం. ఉచిత ఇసుక విధా­నం అంటూ అసలు ఇసుకే లేకుండా చేశారు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలో పది రోజులు కూడా పనులు దొరకని పరిస్థితి. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోంది. భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఉపాధి చూపాలి. లేదంటే ప్రత్యేక సాయం ప్రకటించాలి.   – జొన్నలగడ్డ ధర్మరాజు, భవన నిర్మాణ కార్మికుడు, పేటేరు

పెనమలూరులో పెద్ద ఎత్తున లూటీ
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురులో అక్రమ ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోంది. టీడీపీ నేతలు ఏకంగా 40 ట్రాక్టర్లును అక్రమంగా నదిలోకి దించి, పొక్లయినర్‌తో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 ట్రిప్పులకు పైగానే తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. 

విజయవాడ నగర శివారు­లో ఇంతలా ఇసుక మాఫియా నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)