Breaking News

మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్‌!

Published on Sun, 02/16/2025 - 07:59

సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్‌కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.

వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్‌.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.

లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు  వస్తుందేమోనని భయపడిన రవికుమార్‌.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.

ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్‌ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)