Breaking News

టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

Published on Thu, 02/23/2023 - 04:20

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకా­రావుపై రాళ్లతో దాడి చేసి గాయప­రచడం­తోపాటు హత్యాయత్నానికి అనుచరు­లను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బుధ­వారం కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అద­నపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పోలీసులు హాజ­రుపరిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుప­రచా­లని జడ్జి శిరీష పోలీ­సులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజ­య­వాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసు­లు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు.

పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్‌ వైద్యులు ఇచ్చిన మెడికల్‌ సర్టిఫికెట్‌ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్‌ సర్టిఫికెట్‌­పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

అయితే రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్‌­జైలుకు తనను రిమాండ్‌కు పంపించాలని పట్టాభి కోర్టు­ను అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఉత్త­ర్వులు ఇచ్చారు.

అనంతరం పోలీసులు పట్టా­భిని గన్నవరం సబ్‌ జైలుకు తరలించారు. అయితే సబ్‌ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీర­ం­దరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్‌ యూనస్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితో­పాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)