తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య

Published on Fri, 10/24/2025 - 05:18

తుని రూరల్‌: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కథనం ప్రకారం...విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి సంబంధించి తుని కొండవారపేటకు చెందిన నారాయణరావుపై పోలీసులు బుధవారం ఉదయం కేసు నమోదు చేశారు. సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10.30 సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు రూరల్‌ స్టేషన్‌ నుంచి పోలీసులు ఎస్కార్ట్‌తో తుని బయల్దేరారు. 

ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని నారాయణరావు చెప్పడంతో మార్గంమధ్యలో కోమటిచెరువు వద్ద వాహనం ఆపారు. జోరుగా వాన కురుస్తుండడంతో ఎస్కార్ట్‌ సిబ్బంది చెట్టు కింద నిల్చున్నారు. నారాయణరావు చెరువు వద్దకు వెళ్లాడు. కొంతసేపటికి పెద్ద శబ్దం వినిపించడంతో ఎస్కార్ట్‌ సిబ్బంది వెళ్లి చూశారు. నారాయణరావు కనిపించలేదు. చెరువులో దూకి పారిపోయాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా? అనే అనుమానంతో గాలింపు చేపట్టారు. 

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు వెదికినా నారాయణరావు ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, చెరువులో వలలు వేశారు. క్విక్‌ క్యూఆర్‌టీ టీమ్‌ చెరువు చుట్టూ గాలించింది. ఉదయం నారాయణరావు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)