ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
హిందూపురంలో టీడీపీ నేత వికృత చేష్టలు
Published on Mon, 02/16/2026 - 04:22
సాక్షి, పుట్టపర్తి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృతక్రీడ మరువక మునుపే సీఎం చంద్రబాబు బావమరిది, మంత్రి లోకేశ్ మామ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ నేత నాగేంద్ర మైనర్ బాలికలతో సాగించిన వికృత చేష్టలు బయటపడ్డాయి. బాలికలతో బలవంతంగా శృంగారం చేస్తూ, వాటిని స్వయంగా వీడియోలు తీశాడు.
వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడడం, ప్రైవేటు పార్ట్స్ చూపించమని ఒత్తిడి చేసి రాక్షసానందం పొందిన వీడియోలు వైరల్గా మారాయి. నాగేంద్ర వీడియో కాల్స్, నేరుగా శృంగార వీడియోలు తీయడం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో టీడీపీ నేతల వికృత చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాలికలకు సంబంధించిన వీడియోలు తీయడమే నేరమనుకుంటే.. వాటిని ఎలా బయటకు పంపించారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. బ్లాక్మెయిల్ చేయడానికి అమ్మాయిల వీడియోలు తీసి ఉండవచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Tags : 1