బాలికపై టీడీపీ నేత అసభ్య ప్రవర్తన

Published on Tue, 08/04/2026 - 06:09

రావులపాలెం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్త కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై అదే పాఠశాల పేరెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్, టీడీపీ కొత్తపేట నియోజకవర్గ మైనార్టీ చైర్మన్‌ రహ్మతుల్లా షరీఫ్‌ అసభ్యంగా(బ్యాడ్‌ టచ్‌) ప్రవర్తించినట్టు బాలిక బంధువులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రావులపాలెం పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని మీడియాకు చూపించారు.

బాలిక నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచే షరీఫ్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, బాలిక బుగ్గలు, నడుము, గుండెలపై చేతు­లు వేస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  నిందితుడు అధికార పారీ్టకి చెందిన కీలక నేత కావడంతో రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పైనుంచి ఒత్తిడి పెరుగుతోందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఘటనపై పాఠశాలకు పోలీసులు, విద్యాశాఖ అధికారులు వెళ్లి విచారణ జరిపారు. దీనిపై డీఈఓకు నివేదిక పంపించామని ఎంఈఓ ఆర్‌.నాగకుమార్‌ చెప్పారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, కేవలం రిప్రజెంటేషన్‌ మాత్రమే వచి్చందని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని రావులపాలెం ఎస్‌హెచ్‌ఓ రమే‹Ùబాబు తెలిపారు. 

పోలీసులతోనూ నిందితుడికి సాన్నిహిత్యం  
పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులపై సమాచారం అందిన వెంటనే పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. కానీ, ఇక్కడ అలా జరగలేదు. గతంలో మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ముఖ్య అనుచరుడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన సరోజ్‌ మాడవిని రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు షరీఫ్‌ పోలీసులకు ట్రాన్స్‌లేటర్‌గా పని చేశాడు. ఆ కారణంగా షరీఫ్‌కు పోలీసులతో సాన్నిహిత్యం ఉందనే ప్రచారమూ ఉంది. అధికార పార్టీ నేతపై ఆరోపణలు రావడంతోనే కేసు నమోదులో జాప్యం జరుగుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)