Breaking News

తవ్వుకో.. దోచుకో!

Published on Tue, 11/26/2024 - 06:19

టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తున్నామని గొప్పులు చెప్పుకోవడం తప్పించి ఆచరణలో ఇది అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి ర్యాంపులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక తవ్వకాలతో టీడీపీ నేత ఒకరు పేట్రేగిపోతున్నారు. ఒక్క వారం రోజుల్లోనే రూ.50 లక్షలకుపైగా విలువైన ఇసుకను తరలించేశారు. టీడీపీ నేతకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తవ్వకాలకు అనుమతి లేని రీచ్‌లో భారీ ఎత్తున టీడీపీ నేత ఇసుక కొల్లగొడుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు తూట్లు పొడుస్తూ నదీగర్భంలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్‌ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్‌ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్‌ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వేవారు. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత పెరిగింది.

దీంతో నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ర్యాంపులు సీఆర్‌జెడ్‌ పరిధిలోకి వెళ్లడంతో ఈ రీచ్‌లు మూతపడ్డాయి. ఇసుక కొరత నేపథ్యంలో వీటిని తెరిచేందుకు అధికార యంత్రాంగం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వీటిని తెరిచే వీలులేకపోవడంతో జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, ఔరంగాబాద్‌ ర్యాంపులను ప్రభుత్వం కేటాయించింది.                – సాక్షి, భీమవరం

చక్రం తిప్పిన  శాండ్‌ కింగ్‌..
తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపులపైనా పడింది. జట్టు కార్మికుల ప్రాబల్యం తక్కువగా ఉండటం, బాట అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో తన అక్రమ తవ్వకాలకు ఆయన నడిపూడి ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా ర్యాంపు తెరవాలంటే నీటిపారుదల, గనులు, కాలుష్యం, రెవెన్యూ తదితర శాఖల అనుమతులు తప్పనిసరి. 

అలాగే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతులో జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్‌ చేయాలి. అయితే ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు శాండ్‌ కింగ్‌ చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్‌లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకి తోడి రాత్రివేళల్లో లోడింగ్‌ చేస్తున్నారు. నిర్మాణ పనులకు అనువు కాదని మూసివేసిన ర్యాంపులో వారం రోజులుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

అదనపు చార్జీల రూపంలో భారీ వసూళ్లు..
ఇతర ర్యాంపుల కంటే తక్కువ ధరకు ఇసుక లోడింగ్‌ చేస్తుండడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు నడిపూడి ర్యాంపు వద్ద బారులు తీరుతున్నాయి. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్‌కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు టీడీపీ నేత దండుకుంటున్నారు. ఈ అనధికార ర్యాంపులో రూ.2,500కే ఐదు యూనిట్ల ఇసుక లోడింగ్‌ చేస్తుండడంతో లారీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ర్యాంపు వద్ద నుంచి సిద్ధాంతం వంతెన వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర లారీలు లోడింగ్‌ కోసం వేచి ఉంటున్నాయి. రోజూ 200కు పైగా లారీలు ఇసుక కోసం వస్తున్నాయి.

వీటి నుంచి రూ.6.50 లక్షలు – రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ.అర కోటికి పైగా దండుకోగా ర్యాంపు నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన మొత్తం టీడీపీ అగ్రనా­యకత్వానికి చేరుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ తవ్వకాల్లో తమకు వాటా ఇవ్వకుండా మొత్తం పొరుగు జిల్లా నేత దోచుకుపోతున్నారని స్థానిక కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో పేర్లు లేకుండా టీడీపీ నాయకులే చేస్తున్నవే ఎక్కువగా ఉంటున్నట్టు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)