Breaking News

యువతులను ట్రాప్‌ చేయడమే నవీన్‌ వృత్తి

Published on Tue, 10/22/2024 - 05:42

సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అనుచరుడు, రౌడీషి టర్‌ నవీన్‌ టీడీపీ నాయకుల­తో ఉన్న సంబంధాలను ఆసరా చేసు­కొని పాల్పడిన దారుణాలు వెలుగులోకి వస్తున్నా­యి. ఎవరి­మీద పడితే వారిపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా, యు­వతులను ట్రాప్‌ చేసి, వారి డబ్బుల తో­నే జల్సా­లు చేయడమే అతను వృత్తిగా పెట్టుకొన్నట్లు వల్లభా­పురం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో  గుంటూరులో ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పి లొంగతీసుకున్నా­డు. తర్వాత తెనాలి మండలం ఈమని గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టు­కుని ఆమె డబ్బులతోనే తెనాలిలో ఇల్లు తీసుకుని ఉంటున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం తెనాలి యువతిని వలలో వేసుకొని, ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.

ఆమె ఏటీఎం కార్డు కూడా నవీన్‌ దగ్గరే ఉందని, ఆమె డబ్బులు పెద్ద ఎత్తున వాడుకున్నాడని, తిరిగి డబ్బులు అడిగినందుకే ఇరువురి మధ్య వివాదం జరుగుతోందని గ్రామ­స్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు. కారులో వెళ్తుండగా సడన్‌ బ్రేక్‌ వేయడంతో ముందుకు పడి తలకు దెబ్బ తగిలిందని నవీన్‌ పోలీసులకు చెబుతు­న్నాడు. బ్రేక్‌ వేస్తే తల వెనుక దెబ్బ తగిలే ఆస్కా­రం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా దాడేనని వారు స్పష్టం చేస్తున్నారు. దాడికి ముందు లైంగిక దాడి జరిగిందా! లేదా!అన్న విషయంపై పరీక్షలు నిర్వహించారు.

ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. నవీన్‌ పథకం ప్రకారమే ఆ యువతిని బయటకు తీసుకువెళ్లి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నవీన్‌ ఒక్కడే ఈ పనిచేశాడా? అతని స్నేహితుల హస్తం కూడా ఉందా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. యువతి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నవీన్‌తోపాటు ఇద్దరు స్నేహితులు లైంగికంగా వేధించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అధికార పార్టీతో అతనికి ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ కేసును నీరు గార్చేందుకు పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.

మరింత విషమించిన యువతి ఆరోగ్యం 
నవీన్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. మెదడులో రక్తస్రావం జరుగుతూనే ఉండటంతో అమెను కాపాడేందుకు జీజీహెచ్‌ వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వ­డంలేదు. సోమవారం ఉదయం ఒకసారి హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చిందని, పల్స్‌ పూర్తిగా పడిపోయినట్లు చెబుతున్నారు. ఆ యువతి ఆరు వారాల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)