Breaking News

మహిళలపై టీడీపీ నేత వేధింపులు

Published on Tue, 09/03/2024 - 10:52

శింగనమల: అతనో టీడీపీ చోటా నేత. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా అనధికారికంగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మహిళా కూలీలపై కన్నేశాడు. తన పక్క మీదకు వస్తేనే బిల్లులు చేస్తానంటూ వేధించసాగాడు. చివరకు అర్ధరాత్రి.. అపరాత్రి అని కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యకర సంభాషణలు కొనసాగిస్తుండడంతో విసుగు చెందిన మహిళలు తమను కాపాడాలంటూ నేరుగా ఎస్పీని ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను తప్పించి ఆ స్థానానికి తన పేరును టీడీపీ నాయకుడు శ్రీనివాసులు నాయుడు ప్రతిపాదించుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఆయనకు అందలేదు. అయినా ‘ప్రభుత్వం మాది, అంతా మేము చెప్పినట్లే నడుచుకోవాలి’ అనే ధోరణితో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తానేనంటూ చలామణి అవుతున్నాడు. తర­చూ ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి మహిళా కూలీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.

కొంత మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి రాత్రి సమయంలో ఫోన్లు చేస్తూ అసభ్యకర సంభాషణ సాగించాడు. తన పక్కమీదకు వస్తేనే బిల్లులు చేస్తానని, లేకపోతే ఎవరొచ్చి చెప్పినా వినేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విసుగు చెందిన మహిళలు వారం కిందట శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు.. శ్రీనివాసులు నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మిన్నుకుండి పోయారు. ఈ క్రమంలో అతని వేధింపులు తారస్థాయికి చేరాయి. దీంతో బాధితులు పలువురు సోమవారం అనంతపురంలో జిల్లా ఎస్పీ జగదీష్‌ ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఫోన్‌లో శ్రీనివాసులు నాయుడు మాట్లాడిన సంభాషణకు సంబంధించి వాయిస్‌ రికార్డులు వినిపించారు. అతని నుంచి తమకు రక్షణ కలి్పంచాలని వేడుకున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)