Breaking News

వివాహితకు టీడీపీ నేత లైంగిక వేధింపులు

Published on Fri, 11/28/2025 - 03:20

కావలి(అల్లూరు): టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్‌చౌదరి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ వాపోయింది. ఆయన నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గీతాంజలి తన తల్లి కామాక్షి, బిడ్డతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన చేజర్ల మహేష్‌ రెడ్డితో తనకు 2016లో వివాహమైందని చెప్పారు. హైదరాబాద్‌లో భర్తతో కలిసి ఉంటున్న తమ మధ్య రవికుమార్‌ చౌదరి గొడవలు పెట్టాడని ఆరోపించారు. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి తనను వేధించేవాడని వాపోయారు. 

రవికుమార్‌చౌదరికి చెందిన అతిథిగృహంలో భర్త ముందే తనపై దాడి చేయించాడని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో తన భర్తపైనా, రవికుమార్‌చౌదరిపైనా కావలి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఆ తర్వాత కావలి కోర్టుకు వెళ్లి.. బయట కొస్తుండగా తనతో పాటు తన తల్లిపై భర్త మహేష్‌రెడ్డి, మరికొందరు దాడి చేశారని చెప్పారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. రవికుమార్‌చౌదరి తన భర్తను కూడా దగ్గరే పెట్టుకొని తమ కాపురాన్ని నాశనం చేశాడని వాపోయారు. 

అధికారం అండతో.. చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహిస్తున్నారని.. తమను రక్షించాలని వేడుకున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)