Breaking News

ఊళ్లోకి రారా.. నీ సంగతి తేలుస్తాం..

Published on Tue, 02/17/2026 - 05:45

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులపై రెచ్చిపోయిన మరో ఉదంతమిది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ కార్యకర్తలు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

‘ఎవడ్రా నువ్వు చెత్త నా కొడకా..  ఏ విషయం నాకు తెలియకుండా చేయవద్దని మొన్న నీకు వార్నింగ్ ఇవ్వలేదా.. నీకు చెప్పలేదా.. లం..కొ.. వేషాలు దెం...వా. ఆఫీసులో పెట్టి కొడతాను.. చెత్తనా కొ.. నోరుముయ్యు.. లం..కొ.. నువ్వు నాకు నేరుగా వచ్చి చెప్పవా.. ఎవడికి కావాలి నీ మెస్సేజ్‌. ఇప్పుడు చెరువు పనివారికి ఎందుకు ఫోన్‌చేశావు ? వాళ్లు ఎక్కువా ? మేం ఎక్కువా చెప్పరా వెధవ నా కొ..  ఎవడ్రా నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది.. మర్యాదగా పనిచేయి.. లేకపోతే.. దెం... మాకు చెబుతావా నీతులు.. ఉద్యోగం చేస్తున్న నీకు సిగ్గులజ్జా లేవా..’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌ అనుచరుడు మజ్జి శ్రీనివాసరావు ఫోన్‌లో శివాలెత్తిపోయారు.

ఇంతలో మరో టీడీపీ కార్యకర్త ‘చెత్త నా కొడకా.. నువ్వు ఊళ్లోకి రారా నీ సంగతి తేలుస్తాం.. ఎవరికి కంప్లైట్‌ ఇస్తావో ఇవ్వరా..’ అంటూ నోటికి పనిచెప్పాడు. చిన్నశిర్లాంలో సచివాలయ గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శి వి.బిందుశేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం సోషల్‌ ఆడిట్‌ గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభకు సంబంధించి ముందుగానే ఆ గ్రామ టీడీపీ కార్యకర్తలకు సెల్‌ఫోన్‌ వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ పెట్టి ఆహ్వానించారు.

తమను నేరుగా పిలవలేదంటూ మజ్జి శ్రీనివాసరావు ఫోన్‌లో శివాలెత్తిపోయారు. ఉద్యోగి తల్లిని సైతం బూతులు తిట్టారు. ఫోన్‌లో పంచాయతీ కార్యదర్శి బతిమాలుతున్నా వినలేదు. పంచాయతీ కార్యదర్శిని బూతులు తిట్టిన టీడీపీ వారిపై ఎంపీడీవోకి, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శుల సంఘం నేతలు చెప్పారు.  

ఉద్యోగులకు సైతం భద్రత లేదు 
రాష్ట్రంలో ప్రజలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం భద్రత లేదు. తెలుగుదేశం వారు గూండాల్లా వ్యవహరిస్తూ ఉద్యోగులపై రంకెలేయడం దారుణం.  – డాక్టర్‌ తలే రాజేష్, వైఎస్సార్‌సీపీ , రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)