Breaking News

కల్తీ మద్యం వెనుక టీడీపీ నేత!

Published on Sat, 07/05/2025 - 05:56

సాక్షి, అనకాపల్లి : పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లి జిల్లాను టీడీపీ కూటమి నేతలు కల్తీ మద్యానికి అడ్డాగా మార్చేస్తున్నారు. ఈనెల 2న పరవాడలో కల్తీ మద్యం స్థావరంపై ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేసి ఇద్దరు నిందితులను అరెస్టుచేయడమే కాక వారి నుంచి 72 లీటర్ల స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రుల్లో ఉపయోగించే స్పిరిట్‌ను వీరు హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం తయారుచేస్తున్నారు.

అరెస్టయిన ఇద్దరిలో టీడీపీ నేత రుత్తల రాము కీలకంగా ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంకు చెందిన రాము స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ప్రభుత్వ పాఠశాల పేరెంట్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో రుత్తల రాము చైర్మన్‌గా గెలిచారు. గ్రామంలో ఈయన టీడీపీ తరఫున చురుగ్గా ఉంటారని తెలుస్తోంది. 

మరోవైపు.. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకటేష్‌తో కలిసి రాము నకిలీ మ­ద్యం తయారుచేస్తూ బెల్టు షాపులకు సరఫరా చే­స్తు­న్నట్లు సమాచారం. తొలుత వీరు గ్రామంలో ఒక హోటల్‌ నిర్వహించేవారు. టీడీపీ కూటమి ప్ర­భు­త్వం అధికారంలోకి రాగానే కల్తీ మద్యం వ్యా­పారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

స్పీకర్‌ అయ్యన్నకు సన్నిహితుడు..
ఇదిలా ఉంటే.. కల్తీ మద్యం కేసులో పట్టుబడిన నిందితుడు రుత్తల రాము టీడీపీ కండువాతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయ్యన్నకు అత్యంత సన్నిహితుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఈ కల్తీ మద్యం వ్యాపారం తెర వెనక ఎవరున్నారనే కోణంలో ఎౖMð్సజ్‌ పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు.   

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)