Breaking News

వీఆర్వోలపై టీడీపీ నేత హత్యాయత్నం

Published on Sun, 01/11/2026 - 03:54

పెందుర్తి :  విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ కూటమి నేతల దుర్మార్గాలు తారస్థాయికి చేరాయి. పెందుర్తి మండలం చింతగట్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఆ పార్టీ నాయకుడు.. అందులోని నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరు వీఆర్వోలు, ఆక్రమణ తొలగించేందుకు వచి్చన జేసీబీ, ఆపరేటర్‌పై రాళ్లు, రాడ్‌లతో ఆ పార్టీ సీనియర్‌ నేత చీపురపల్లి నరసింగరావు, అతని కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో  నరసింగరావు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.  

అసలేం జరిగిందంటే.. 
చింతగట్ల రెవెన్యూ సర్వే నెంబర్‌ 57/1, 2లలో దాదాపు 20 సెంట్ల ప్రభుత్వ భూమిని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరుడు చీపురపల్లి నరసింగరావు ఆక్రమించి అందులో నిర్మాణాలు ప్రారంభించాడు. దీనిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. విశాఖ జిల్లా జేసీ స్పందించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఐ.వెంకట అప్పారావును ఆదేశించారు. ఈ క్రమంలో నరసింగరావు వద్ద ఏమైనా పత్రాలుంటే తీసుకురావాలని అధికారులు కోరారు. దీనిని పెడచెవిన పెట్టడంతో ఆ నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా తహసీల్దార్‌ సిబ్బందిని ఆదేశించారు.

వీఆర్వోలు నాగహనుమాన్‌ కుమార్‌ ధర్మేంద్ర కట్టడాలను తొలగించేందుకు సన్నద్ధమవుతుండగా నరసింగరావు, అతని భార్య చిన్నీ, కుమారుడు రాజేష్, ఇద్దరు వీఆర్వోలు, జేసీబీపైకి రాళ్లు రువ్వారు. రాడ్‌లు పట్టుకుని దుర్భాషలాడుతూ చంపుతామంటూ మీదకు దూసుకెళ్లారు. దీంతో వీఆర్వోలు, జేసీబీ ఆపరేటర్‌ పరుగులు తీశారు. వారి దాడిలో జేసీబీ ధ్వంసమైంది. ఘటనపై వీఆర్వోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడిన కేసులో నరసింగరావు 90 రోజుల రిమాండ్‌ అనుభవించినట్లు సమాచారం. ఘటనపై తహసీల్దార్‌ వెంకట అప్పారావు మా­టా­్లడుతూ.. నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించామని.. చట్ట ప్రకారం వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు.  

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)