Breaking News

న్యాయవాదిపై టీడీపీ నేతల దాడి..ఇల్లు కూల్చివేత

Published on Wed, 01/21/2026 - 05:15

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం ఉందనే అండ చూసుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చివరకు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులనూ వదలడం లేదు. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపురం గ్రామంలో మంగళవారం లాయర్‌ అచ్చా మరిడియ్యపై స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తండ్రి నుంచి సంక్రమించిన 12 సెంట్ల స్థలంలో మరిడియ్య రేకులతో ఇల్లు నిర్మించుకున్నారు.

అయితే ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు గతంలో టీడీపీ నేతలు యత్నించగా మరిడియ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా ఆర్డర్‌  ఇచ్చింది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన యడ్ల అప్పలరాజు, యడ్ల సూరిబాబు, యర్రమిల్లి సూర్యప్రకాష్‌ యడ్ల సత్యనారాయణ, యర్రమిల్లి దుర్గ రమేష్‌ మంగళవారం తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు మరిడియ్య విలేకరులకు తెలిపారు. జేసీబీతో తన ఇంటిని కూల్చేయడంతో కోర్టు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు ధ్వంసం అయ్యాయన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన మరిడియ్య ప్రస్తుతం తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు 
దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా తొండంగి పోలీసులు స్వీకరించలేదని మరిడియ్య తెలిపారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు, కోర్టులో న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. న్యాయవాదిపై జరిగిన దాడిని బార్‌ అసోసియేషన్, న్యాయవాద సంఘాలు ఖండించాయి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని మరిడియ్య అధికారులను కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)