Breaking News

బాబును మానసిక క్షోభకు గురిచేస్తున్నారు

Published on Tue, 09/26/2023 - 05:36

సాక్షి, రాజమహేంద్రవరం: తప్పుడు కేసులతో జైల్లో పెట్టి తన భర్త చంద్రబాబును ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని నారా భువనేశ్వరి ఆరోపించారు. బాబు భోజనం చేసేందుకు కనీసం టేబుల్‌ కూడా ఇవ్వడం లేదని, ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్న అనంతరం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో బాబును ఎవరూ బెదరించలేరన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరె­స్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో జ్యుడిíÙయల్‌ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ములాఖత్‌ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలు, రాజ­కీయ పరిస్థితులపై చర్చించారు. జైలు నిబంధనల మేరకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు బయటే ఉండిపోయారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘బాబు ధైర్యంగా, ఆత్మస్థయిర్యంతో ఉన్నారు.

టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు. పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లు. వాళ్లే లేకుంటే పార్టీలేదు. పోలీసులు ఏం చేసినా వారు బెదరరు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.  

సీఐడీవి పనికిమాలిన ప్రశ్నలు: అచ్చెన్నాయుడు
కస్టడీలో చంద్రబాబును సీఐడీ అడిగినవన్నీ పనికిమాలిన ప్రశ్నలేనని అచ్చెన్నాయుడు విలేకరుల సమా­వేశంలో విమర్శించారు. ఆధారం లేని కేసుల్లో ఇరికించారన్నారు. రెండు రోజుల విచారణలో ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే సమాధానం చెప్పడం లేదన్నారు. కస్టడీలో 33 ప్రశ్నలు పనికిమాలిన, స్కామ్‌కు సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్నారు.

ఆ ప్రశ్నలను తీసుకున్నామని, న్యాయ నిపుణుల సలహా సైతం తీసుకున్నామని, ప్రతి ప్రశ్నకు జవాబును విపులంగా ప్రజల ముందు ఉంచుతామన్నారు. చంద్రబాబు జైల్లో ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆయన భద్రతపై భయ­ంగా ఉందన్నారు. దోమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బాబుకు జైల్లో ఏమైనా జరిగితే అందుకు కర్త, కర్మ, క్రియ జగనేనన్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు అన్ని అనుమ­తులు తీసుకున్నామని, త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. 

16వ రోజుకు చేరిన చంద్రబాబు జైలు జీవితం
కాగా, సోమవారానికి చంద్రబాబు జైలు జీవితం 16వ రోజుకు చేరింది. మరో 10 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండనున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)