Breaking News

లంచాల బాగోతంలో టీడీపీ కీలక నేత!

Published on Thu, 07/11/2024 - 06:17

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన రైల్వే అధికారుల లంచాల కేసులో రోజుకో కొత్త వ్యక్తి పేరు వెలుగుచూస్తోంది. గుంతకల్లు రైల్వే డివిజనల్‌ అధికారులు కాంట్రాక్టు పనులు ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల సీబీఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌తో పాటు మరో నలుగురు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లను సీబీఐ ఇప్పటికే అరెస్టుచేసింది. లంచాల వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో కొత్తకొత్త పేర్లు బయటకొస్తున్నాయి. 

ఈ క్రమంలోనే తెలుగుదేశం పారీ్టకి చెందిన ఒక కాంట్రాక్టరు కూడా కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గం కొట్టాల గ్రామానికి చెందిన సదరు కాంట్రాక్టరు గత పదిహేనేళ్లుగా రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నారు. రైల్వే అధికారులకు ముడుపులు చెల్లించి కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం, మిగతా కాంట్రాక్టర్లను దగ్గరకు కూడా రానివ్వకపోవడం వంటివి చేసేవారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో ఈ కాంట్రాక్టరు రింగు లీడర్‌గా వ్యవహరించే వారని, గడిచిన నాలుగేళ్లలో రూ.150 కోట్ల విలువైన పనులు చేసినట్లు సమాచారం. 

హుటాహుటిన హైదరాబాద్‌కు.. 
ఈ నేపథ్యంలో.. టీడీపీకి చెందిన సదరు కాంట్రాక్టరు పేరు సీబీఐ అధికారుల పరిశీలనలో ఉండటంతో అతను హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లినట్లు ఇక్కడి కాంట్రాక్టర్లు చెబుతున్నారు. లంచాల వ్యవహారంలో ఇప్పటివరకూ 17 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. అందులో తన పేరు లేకుండా చేసుకునేందుకు సదరు కాంట్రాక్టరు భారీస్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

ఇతని ఆధిపత్యాన్ని భరించలేకే కొంతమంది కాంట్రాక్టర్లు సీబీఐని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. డీఆర్‌ఎం (డివిజనల్‌ రైల్వే మేనేజర్‌), డీఎఫ్‌ఎం (డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌)లకు ఇతనే భారీగా ముడుపులిచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈయన చేసిన కాంట్రాక్టుల వివరాలన్నీ సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు.

2014 నుంచి డాక్యుమెంట్ల పరిశీలన.. 
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి పాత వివరాలన్నీ సీబీఐ అధికారులు తోడుతున్నారు. 2014 నుంచి 2024 మార్చి వరకు జరిగిన కాంట్రాక్టుల అగ్రిమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. సుమారు 500 వరకూ అగ్రిమెంటు కాపీలు స్వా«దీనం చేసుకున్నారు. పనులు చేయకపోయినా బిల్లులు చేసుకున్నట్లు గుర్తించారు. 

ఒక్కో కాంట్రాక్టు పనికి సంబంధించి అగ్రిమెంటు దశలో 1 శాతం, ఇంజినీర్లకు 2 శాతం, ఫైనాన్స్‌ మేనేజర్‌కు 2 శాతం.. ఇలా  కాంట్రాక్టు అగ్రిమెంటు నుంచి బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకూ 10 శాతం వరకూ లంచాలు ముట్టాయి. అంటే.. రూ.100 కోట్ల పనులు చేస్తే రూ.10 కోట్ల వరకు లంచాల రూపంలో అధికారులకే ముట్టాయి. దీంతో గడిచిన పదేళ్లలో రైల్వే డివిజన్‌ పరిధిలో జరిగిన అన్ని పనులను సీబీఐ అధికారులు  పరిశీలిస్తున్నారు. ముడుపులు రూ.వందల కోట్లలో చెల్లించినట్లు తెలుస్తోంది.  

#

Tags : 1

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)