Breaking News

సీఎం జగన్‌ వల్లే మాకు మేలు

Published on Thu, 01/05/2023 - 04:48

పిఠాపురం: కాకినాడ జిల్లా తాటిపర్తికి చెందిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న సత్యనారాయణకు చేనేత పింఛన్, ఆయన మనవరాలికి దివ్యాంగ పింఛన్‌ వచ్చింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం పింఛన్‌లు అందించారు. తొలిసారి పింఛన్‌ అందుకున్న సత్య­నారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా­రు. సీఎం వైఎస్‌ జగన్‌ దయ వల్లే తనకు పింఛన్‌ రా­వడంతో పాటు తన మనవరాలు వైకల్యాన్ని జయిం­చిందన్నారు.

‘నా మనవరాలు లిఖి­త­శ్రీ పుట్టుక నుం­చే దివ్యాంగురాలు(మూగ, చెవుడు). మాది నిరుపేద కుటుంబం. ఆపరేషన్‌ చేయించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లలకు ప్రభు­త్వం ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఆదుకుంటోందని తెలిసి.. అధికారులను కలిశాను. వారు ఒక చెవికి ఆపరేషన్‌ మాత్రమే చేస్తామని, సీఎం జగన్‌ను కలుసుకుంటే పూర్తిగా ఆపరేషన్‌ చేసే అవకా­శం ఉందన్నారు.

తాను టీడీపీ జన్మభూ­మి కమిటీ సభ్యుడిని అయినందున తనకు సాయం చేస్తారో లేదోనని భయపడ్డాను. కానీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చొరవతో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. విపక్ష పార్టీ వాడినని చూడకుండా ఆయన వెంటనే ఎంత ఖర్చయినా పాప­కు వినికిడి, మాట వచ్చేలా చూడాలని అధికారు­లను ఆదేశించారు. మా మనవరాలికి చెవుల­కు ప్రభుత్వమే రూ.14 లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్‌ చేయించడమే గాక, ఏడాదిన్నర పాటు ఉచితంగా మం­దులు కూడా ఇచ్చింది. ఇప్పుడు నా మనవరా­లు కోలుకుంది. దానికి సీఎం వైఎస్‌ జగనే కారణం’ అం­టూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.   

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)